Risat 1 satellite launch a grand success

science and technology,scientific exploration,scientific institutions,technology (general),rocketry,PSLV-C19, RISAT-1, ISRO, PSLV, RISAT, Radhakrishnan, radar imaging satellite, Synthetic Aperture Radar, Active Microwave Remote Sensing Satellite

The PSLV-C19, the newest in the series of polar satellite launch vehicles of the Indian Space Research Organisation (ISRO), burst off the launch-pads of Sriharikota in the wee hours of Thursday on its space mission of placing indigenously developed Radar Imaging Satellite the RISAT-1 in a polar circular orbit.

RISAT-1 satellite launch a grand success.gif

Posted: 04/26/2012 10:54 AM IST
Risat 1 satellite launch a grand success

PSLV-C19నెల్లూరు జిల్లా శ్రీహరి కోట సతీష్ థామన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రోజు తెల్లవారు జామును 5 గంటల 47 నిమిషాలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ – 19 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం అయింది. ఈ ఉప గ్రహం 17 నిమిషాల 50 సెకండ్లలో కక్ష్యలోకి ప్రవేశించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-19(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ఉపగ్రహ వాహకనౌక ద్వారా రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1(రిశాట్) ప్రయోగం విజయవంతం అయిందని శాస్ర్తవేత్తలు తెలిపారు.

పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల కంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం. ఈ ప్రయోగానికి చంద్రయాన్-1కు వినియోగించిన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగించారు. 498కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పీఎస్‌ఎల్‌వీ సీ-19 ప్రాజెక్టులో ఉపగ్రహానికి 378కోట్లు, రాకెట్‌కు 120కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు పదేళ్లు కష్టపడి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1తో అటు రైతులకు, ఇటు రక్షణకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పరికరం భూమిని అన్ని వేళలా పరిశీలిస్తూ ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాల రాకను గుర్తిస్తుంది. వరదలను కూడా పసిగట్టే సామర్థ్యం ఉంది. అడవులు, భూమిలో దాగి ఉన్న జలవనరులు, నిధి నిక్షేపాల జాడను కనిపెడుతుంది. రక్షణకు సంబంధించిన అంశాలను అతి దగ్గరగా ఛాయాచిత్రాలు తీసి పంపుతుంది.

కక్షలోకి చేరుకున్నట్టు కనిపించగానే షార్‌ కేంద్రం చప్పట్లతో మారుమోగింది. సైంటిస్టులు ఒకరినొకరిని అభినందించుకున్నారు. ఈ వాహకనౌక ద్వారా 1,830 కిలోలు బరువు కలిగిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1ని 480 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్షలోకి ప్రవేశపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gadde babu rao to join ysrcp
Dowry pours cold water on chinese men  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles