I will contest only as a jagan cadidate

i will contest only as a jagan cadidate

i will contest only as a jagan cadidate

5.gif

Posted: 04/25/2012 10:49 AM IST
I will contest only as a jagan cadidate

               KONDA_SUREKHA__10175eదివంగత నేత  వైఎస్ రాజశేఖరరెడ్డి పోయినప్పటికీ ఆయన ఫొటో మాత్రం ఇటీవల కాలంలో ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలే మల్లగుల్లాలు పడుతున్నారు. వైఎస్ ఫొటో పెట్టుకుని ముందుకు పోదాం అని కొందరంటుంటే, ససేమిరా కుదరందంటున్నారు మరికొందరు.
                ఇదిలా ఉంటే.. అసలే తెలంగాణాలో తమ ఉనికికే ప్రమాదమొచ్చే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి టీడీపీ,కాంగ్రెస్. అయితే.. పూర్తిస్థాయి సమైఖ్యవాదిగా పావులు కదిపిన దివంగత వైఎస్ఆర్ ఫొటో పట్టుకుని ఊరేగింపులు నిర్వహించి తెలంగాణలో ఓట్లడుగుతాం అంటోంది పరకాల మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ.  అంతేకాకుండా వచ్చే ఉపఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుతోనే పోటీచేస్తానని కొద్దిసేపటి క్రితం వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తేల్చిచెప్పారు. ప్రతి ఉపఎన్నికల తర్వాత తెలంగాణ వస్తోందని అసత్య ప్రచారం చేస్తోందని, తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ పబ్బం గడుపుకుంటోందని కొండా సురేఖ ఆరోపించారు.
            తెలంగాణ వాదం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమైఖ్యరాష్ట్ర ప్లకార్డు పట్టుకుని లోక్ సభలో నిల్చున్న జగన్ కూడా ప్రయాణించి  కొండా సురేఖ ఎలా నెట్టుకొస్తుందో అనేది ఆసక్తిదాయకం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoists to release bjd mla on thursday
Big reshuffle in congressold ministers to come back  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles