Election commissioner hs brahma talk about by pols in ap

election commissioner hs brahma talk about by pols in ap

election commissioner hs brahma talk about by pols in ap

23.gif

Posted: 04/22/2012 03:43 PM IST
Election commissioner hs brahma talk about by pols in ap

             hs_brahma రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ సూచనప్రాయంగా చెప్పారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. త్వరగా ఉప ఎన్నికలు నిర్వహిస్తే గెలిచిన ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని కొందరు చేస్తున్న విజ్ఞప్తులను తప్పకుండా పరిశీలిస్తామని పేర్కొన్నారు.            

               రాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ పాల్గొనే అవకాశం కల్పిస్తామంటూ ఉప ఎన్నికలు ముందే జరిపిస్తామన్న సంకేతాలు అందించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావించినా.. తాము నోటిఫికేషన్ ఇస్తే వారు తేదీలను మా ర్చుకుంటారని చెప్పారు. ఉప ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగేవని, స్థానిక ఎన్నికలను 1,2రోజులు పొడిగించుకున్నా సమస్య ఉండబోదని వివరణ ఇచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp chiranjeevi predictions on by pols
Cm kiran kumar reddy kadapa district tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles