Cm kiran kumar reddy kadapa district tour

cm kiran kumar reddy kadapa district tour

cm kiran kumar reddy kadapa district tour

35.gif

Posted: 04/22/2012 01:01 PM IST
Cm kiran kumar reddy kadapa district tour

              cm_kir_111 తాను అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నానని.. సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నానని సీఎం కిరణ్ పేర్కొన్నారు. కడప జిల్లా ప్రజాపథం సభలలో ఆయన మాట్లాడారు. "నేను పగ్గాలు చేపట్టాక.. రాజశేఖరన్న హయాంలో బకాయిలకే రూ.8 వేల కోట్లు చెల్లించాను. ఇరిగేషన్, పావలావడ్డీ, తదితర పద్దులకు, ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్‌కు రూ.5,250 కోట్లు చెల్లించాను. విద్యుత్తు భారం పెంచామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నారు. అయితే పేదవాడిపైన, రైతులపైనా ఎలాంటి భారం మోపలేదని తెలిపారు. "ఇది పనిచేసే ప్రభుత్వం. అవసరం వచ్చినప్పుడు ఆశీర్వదించాలి. ఇప్పుడు చూపించే అభిమానం అప్పుడు కూడా చూపించాలి'' అని పరోక్షంగా ఉప ఎన్నికలకు ప్రజల మద్దతు కోరారు. cm_kir_222
               స్త్రీ నిధి పథకం కింద ఎస్సెమ్మెస్ పంపితే.. 48 గంటల్లో రుణాలిచ్చే విధంగా చర్యలు తీసుకొంటున్నామని సీఎం తెలిపారు. మహిళలకు ఈ ఏడాది రూ. 11,500 కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, స్త్రీ నిధి కింద రూ. 1500 కోట్లు వడ్డీలేని రుణాలనిస్తున్నామని తెలిపారు.
              కాగా,  రాష్ట్రపతి ఎన్నికకు ముందే ఉప ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లా పర్యటనలో ఉన్నముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి ఇవాళ (ఆదివారం) కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మంతనాలు జరుపుతున్నారు. ప్రధానంగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి రాయచోటికి రాం ప్రసాద్‌ రెడ్డి, రాజంపేట మేడా మల్లికార్జునరెడ్డి, రైల్వే కోడూరుకు ఈశ్వరయ్య పేర్లు వినబడుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Election commissioner hs brahma talk about by pols in ap
Maddela cheruvu soori wife bhanumati reaction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles