రసాలలో శ్రుంగార రసం ఒకటి. ఈ రసం భార్య భర్తలిద్దరు కలిసి సేవిస్తేనే.. ఫలితం ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరి ఇష్టం లేకపోయిన శ్రుంగార రసం పండదు. ఇది ముఖ్యంగా భార్య భర్తలు మాత్రమే రసం తాగాలి.
ఈ శ్రుంగార క్రీడకు ఇరువురు ఉత్సహంగా ఉంటేనే.. ఆట రక్తికడుతుంది లేకుంటే.. ఆట యొక్క విలువ పోతుందని పెద్దలు అంటారు. ఇప్పుడు ఈ శ్రుంగార క్రీడా పై బెంగళూరు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
పెళ్లి , సంసార జీవితంలో లైంగిక చర్య ప్రధాన అంశమని బెంగళూరు హైకోర్టు పేర్కొంద. భార్యాభర్తల్లో ఎవరైనా ఆ ప్రక్రియాను నిరాకరిస్తూ వస్తే దానిని క్రూరత్వం కింద పరిగణించి విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది.
చెన్నైకి చెందిన వ్యక్తికి, దావణగెరెలో చెందిన మహిళతో 2002లో వివాహమైంది. ఉద్యోగరీత్యా భర్త చెన్నైలో , భార్య దావణగెరెలో ఉంటున్నారు. సెలవు రోజుల్లో ఆమె చెన్నైకి వచ్చినా శ్రుంగారానికి అంగీకరించడం లేదని, తనకు విాకులు మంజూరు చేయాలని భర్త బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో 2005లో కేసు వేశారు.
తనకు లైంగిక చర్య లేకున్నా విడాకులకు అంగీకరించనని భార్య చెప్పటంతో మూడేళ్ల తరువాత 2008 లో ఫ్యామిలీ కోర్టు కేసు కొట్టివేసింది. ఈ తీర్పును ప్రశ్నిస్తూ భర్త, ఇక్కడి హైకోర్టులో అర్జీ వేశారు. కేసును జస్టిస్ ఎన్.కె.పాటిల్ , జస్టిస్ బి.వి.పింటోల ధర్మాసనం విచారించింది.
అవకాశం ఉండి దంపతుల్లో ఎవరైనా లైంగిక ప్రక్రియకు అనుమతించకపోవటం క్రూరత్వం కిందకే వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. విడాకుల్ని మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more