ఢిల్లీలో వారం రోజుల పాటు తిష్టవేసినా అక్కడ కానీ, రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కానీ కెసిఆర్ మీడియాకు దూరంగా ఉండిపోవడంతో తెలంగాణవాదుల్లో అయోమయం నెలకొంది. టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు మాత్రం కెసిఆర్ మౌనానికి కారణాలు వేరే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చేపట్టిన బస్సుయాత్రకు టిఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉండటం తెలంగాణవాదుల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఢిల్లీలో లాబీయింగ్ జరుపుతున్నారని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్వయంగా చెప్పినప్పటికీ, ఆయన రాష్ట్రానికి చేరుకొని వారం గడుస్తున్నా ఆ ఊసే ఎత్తకుండా మౌనంగా ఉండిపోవడం పట్ల తెలంగాణవాదులు ఆందోళన చెందుతున్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉప ఎన్నికలు ముగిసే వరకు మౌనంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్ఠానం విజ్ఞప్తి చేసిందని, ఆ కారణంగానే ఆయన నోరు మెదపకుండా ఉండేందుకు ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని అంటున్నారు.
కెసిఆర్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లివచ్చినా అక్కడ జరుగుతోన్న పరిణామాలను టిజెఎసి నేతలతో పంచుకునే వారు. కానీ ఈసారి అక్కడి విషయాలను టిజెఎసి నేతలతో కెసిఆర్ పంచుకోకపోవడంతో అక్కడి పరిణామాలు తమకు కూడా తెలియడం లేదని టిజెఎసిలో కీలక భూమిక పోషిస్తోన్న నాయకుడు ఒకరు వాపోయారు. అయితే ఈ నెల 24లోగా తెలంగాణపై కాంగ్రెస్, టిడిపిలు తమ వైఖరి వెల్లడించాలని టిజెఎసి ఆ రెండు పార్టీలకు డెడ్‌లైన్ విధించినప్పటికీ, ఆ విషయంపై టిఆర్‌ఎస్ నేతలు నోరు మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని తెలంగాణవాదులు, టిజెఎసి నేతలు వాపోతున్నారు. సీమాంధ్రలో ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు తెలంగాణ అంశంపై టిఆర్‌ఎస్‌ను మౌనంగా ఉండమని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించి ఉండవచ్చని, అందుకే ఆయన కెసిఆర్ నోరు మెదపడం లేదని టిజెఎసి నేతలు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వర్గంలోని పెద్దలను కలవడానికే, పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కూడా కెసిఆర్ అక్కడ ఎక్కువ రోజులే ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తున్న నేపథ్యంలో ఆ సందర్భంలో ఎవరెవరిని కలిసింది, వారు ఆయనకు ఏమి చెప్పింది, ఆ విషయాలేవి బయటికి పొక్కకుండా టిఆర్‌ఎస్ జాగ్రత్త పడుతోంది.
మరోవైపు టిఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉన్నా, వారి కోసం వేచి చూడకుండా తాము మాత్రం ఊరూర తిరిగి కనీసం ఆత్మహత్యలు ఆపేందుకైనా బస్సుయాత్ర పెట్టుకున్నామని టిజెఎసి నేత ఒకరు తెలిపారు. ఇలా ఉండగా, ఢిల్లీ నుంచి వచ్చాక కెసిఆర్ మౌనంగా ఉండటానికి, కారణాలు వేరే ఉన్నాయని టిఆర్‌ఎస్ ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించి రెండేళ్లు గడిచాక కూడా ఆ వాదం ఈ ప్రాంతంలో ఎంతబలంగా ఉందో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చిందని, అలాగే రాష్ట్రాన్ని విభజించవద్దని సీమాంధ్రలో జరిగిన సమైక్యవాదం ఇంకా ఏమేరకు ఉందో అక్కడ జరిగే ఉప ఎన్నికల తర్వాతగానీ ఒక అంచనాకు వస్తామని, అప్పటి వరకు మౌనంగా ఉండమని కెసిఆర్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం కోరిందని, అదే ఆయన వౌనానికి కారణమై ఉంటుందని సదరు నాయకుడు అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more