Titanic cruise ship forced to turn back briefly

Titanic cruise ship forced to turn back briefly,titan, ill passenger, BBC, MS Balmoral, original ship, Retrace,titanic, MS Balmoral, Titanic Memorial Cruise, Southampton, England, news, hindustan times, Miles Morgan Travel, Miles Morgan

Titanic cruise ship forced to turn back briefly

Titanic.gif

Posted: 04/11/2012 11:02 AM IST
Titanic cruise ship forced to turn back briefly

Titanic cruise ship forced to turn back briefly

చరిత్రాత్మక టైటానిక్ నౌక మునిగిన ప్రమాదం జరిగి శత వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా.. కాకతాళీయంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచారంతో కూడిన అనేక కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. భయంకరమైన ఈ టైటానిక్ నౌక ప్రమాదానికి సంబంధించి గత రెండు నెలలుగా అనేక కొత్త పుస్తకాలు వెలువడ్డాయి. 1912లో జరిగిన ఈ ప్రమాదంపై ఇది వరకే వెలువడిన పుస్తకాలు పునర్ముద్రణతో మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి.

వీటిలో ‘టైటానిక్, ఫస్ట్ అకౌంట్స్’ పేరిట వెలువడిన పుస్తకం ఒకటి. పెంగ్విన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని టిమ్ మాల్టిన్, నికోలాస్ వేడ్ ఎడిట్ చేశారు. లారెన్స్ బీస్లీ, మార్గరెట్ బ్రౌన్, అర్చిబాల్డ్ గ్రేసీ, కార్లోస్ ఎఫ్ హర్డ్ వంటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. చరిత్రకారుడు ఫ్రానెసస్ విల్సన్ వెలువరిచిన ‘హౌ టు సర్వైవ్ ద టైటానిక్: ద సింకింగ్ ఆఫ్ జె బ్రూస్ ఇస్మే’ పుస్తకం టైటానిక్ ప్రమాదం, తదనంతర పరిణామాలను కూలంకషంగా వివరించింది.

Ship retracing Titanic route turns back for ill passengerTitanic memorial passengers Carmel Bradburn and Andreas Storic from Adelaide dressed in period Edwardian costumes posing in a replica of the Titanic dining room. Picture:.. Supplied

హార్పర్ కోలిన్స్ ప్రచురించిన పుస్తకంలో 1912 ఏప్రిల్ 14న టైటానిక్ నౌక సముద్రంలో ఓ మంచుకొండను ఢీకొన్న సమయంలో చోటు చేసుకున్న సన్నివేశాలను వివరించింది. చావడానికి సిద్ధమైన వెయ్యి మంది పురుషులు తమ చివరి సిగరెట్ వెలిగించుకున్నారని పేర్కొంది. అప్పటికే మహిళలు, పిల్లలతో నిండి ఉన్న లైఫ్‌బోట్‌లోకి నౌక యజమాని ఇస్మాయ్ దూకేశాడని తెలిపింది. (చిత్రం) టైటానిక్ నౌక మునిగిపోయి సుమారు వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు ఆ నౌక ఏ ప్రదేశంలో మునిగిందో చూడడానికి బయల్దేరారు. ‘ఎంఎస్ బాల్మోరల్ టైటానిక్ మెమోరియల్ క్రూయిజ్ షిప్’ వీరిని తీసుకొని ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుంచి బయల్దేరింది. టైటానిక్ ప్రమాదంలో మరణించిన వారి బంధువులు నౌకలోంచి సముద్రాన్ని తిలకిస్తున్నప్పటి చిత్రమిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Football games
Zimbabwe regime dismisses mugabe deathbed reports  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles