Football games

football games,skip Games football tournament,University of Queensland Rugby players

football games,University of Queensland Rugby players

football.gif

Posted: 04/11/2012 12:53 PM IST
Football games

football games

పోటీకి దిగిన ప్రతిసారీ అద్భుతాలు సృష్టించే చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు నటనలోనూ గొప్పవాళ్లే. ఆస్కార్ అవార్డు స్థాయిలో వారు మైదానంలో నటించేస్తుంటారు. అవసరం లేకపోయినా ‘డైవ్’ చేస్తారు. ప్రత్యర్థి తనకు ఢీకొన్నా, లేకపోయినా పెద్ద దెబ్బతగిలినట్టు కింద పడి గిలగిల కొట్టుకుంటారు. బాధతో అల్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. డైవ్ చేసినా, ప్రత్యర్థి ఆటగాడు లేదా ఆటగాళ్ల వల్ల గాయపడినా తమ జట్టుకు ‘పెనాల్టీ’ లభిస్తుందన్న ఆశే వారితో అసాధారణ నటన చేయిస్తుందని క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీకి చెందిన రోబీ విల్సన్ పరిశోధన స్పష్టం చేస్తున్నది.

స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లో లీగ్ పోటీలకు సంబంధించి 60 మ్యాచ్‌లను ఆమెను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ మ్యాచ్‌లలో ఆటగాళ్లు డైవ్ చేసిన లేదా కిందపడి అల్లాడిపోయిన సంఘటనలు 2,803 ఉన్నాయి.
వీటిలో కేవలం 169 మాత్రమే నిజమైన డైవ్‌లు లేదా గాయపడిన సంఘటనలని రోబీ తేల్చిచెప్పింది. మిగతా 2,633 సంఘటనల్లో ఆటగాళ్లు నటించారే తప్ప నిజానికి కిందపడాల్సిన అవసరంగానీ, గిలగిల కొట్టుకోవాల్సిన ఆగత్యంగానీ లేవని రోబీ సాక్ష్యాధారాలతో నిరూపించింది. మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తున్నప్పుడు లేదా తమ జట్టు ఓడడం ఖాయంగా కనిపించినప్పుడు ఫుట్‌బాలర్లు ఆటకు బదులు నటనపైనే ఆధారపడతారని ఆమె నివేదిక పేర్కొంటున్నది. ఇదే సూత్రం మిగతా క్రీడలకూ వర్తించే అవకాశం లేకపోలేదు.

ప్రత్యక్షంగానో లేదా టీవీలోనో మ్యాచ్‌ని చూస్తూ, కిందపడి బాధతో విలవిల్లాడే ఆటగాళ్లను చూసి జాలిపడని వాళ్లు ఉండరు. వీటిలో ముప్పాతిక సంఘటనలు కేవలం కల్పితాలని, ఆటగాళ్లు నటిస్తున్నారని తెలిసిన తర్వాత సగటు అభిమాని తెగబాధపడిపోతాడేమో! మైదానం నలువైపులా ఉంచిన లెక్కకు మించిన కెమేరాలతో మ్యాచ్‌లను కవర్ చేస్తూ, ప్రతి చిన్న కదలికను కూడా రికార్డు చేస్తున్న ఈ రోజుల్లో కెమేరా కంటికి కూడా చిక్కకుండా అంతా నిజమేనని నమ్మించే స్థాయిలో నటించడం సులభం కాదు. ఈ ఆటగాళ్లకు ఆస్కార్‌ను మించిన అవార్డును కనిపెట్టి మరీ ఇవ్వక తప్పదు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stop the olympic games
Titanic cruise ship forced to turn back briefly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles