యూకేలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఎంతలా అంటే.. తోటలకు నీళ్లు పట్టడానికి పైపుల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది! ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే వంద పౌండ్ల అపరాధ రుసుం విధించనుంది. బ్రిటిషర్లు గార్డెనింగ్ కు అధిక ప్రాముఖ్యం ఇస్తారు. అందునా ఆగ్నేయ ఇంగ్లాండ్ వాసులలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. తోటపని అంటే అక్కడి వారికి మహా ఇష్టం. 70శాతం బ్రిటిషర్లు దాన్ని ఒక ముఖ్యమైన పనిగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాల్లోనే ప్రభుత్వం నీటిపైపుల వాడకాన్ని నిషేధించింది. అయితే ఈ నిర్ణయంపై దేశంలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బ్రిటన్లో తీవ్ర కరువు నెలకొంది.
రెండేళ్లుగా నీటిచుక్క దొరకడం లేదు. రికార్డుస్థాయిలో కొరత ఏర్పడింది. ప్రజల అవసరాలను తీర్చడానికి నీటి సరఫరా సంస్థలు తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గార్డెనింగ్పై నిషేధం తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల దాదాపు 20లక్షల మంది తమ సరదాకు దూరమవుతారని అంచనా. ఒలింపిక్ స్టేడియాల్లోని పచ్చిక బయళ్లను మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయించారు. నీటిని తెలివిగా వినియోగించండి అంటూ ప్రభుత్వం, నీటి సరఫరా సంస్థలు సూచిస్తున్నాయి. నీళ్లను ఎలా పొదుపుగా వాడుకోవాలో సలహా ఇస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more