I am the winner omar abdhullah

i am the winner ...omar abdhullah

i am the winner ...omar abdhullah

26.gif

Posted: 04/08/2012 07:24 PM IST
I am the winner omar abdhullah

             omar_2పాకిస్థాన్ అధ్యక్షుడితో పందెం కట్టి గెలిచానంటున్నారు కాశ్మీర్ సీఎం ఒమర్. నిజంగా.. తనకు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఒక రూపాయి బాకీ పడ్డాడని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. భారత పర్యటన కు వచ్చిన సందర్భంలో జమ్మూ, కాశ్మీర్‌లో జర్దారీ పర్యటించలేడని తాను గతంలో ఆయనతోనే పందెం కాశానని ఓన్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  2006 సంవత్సరంలో పాకిస్థాన్‌లో తాను  పర్యటించినపుడు,  కాశ్మీర్‌లో పర్యటించలేవని జర్దారీతో తాను ఒక రూపాయి పందెం కాసిన విషయాన్ని ఒమర్  జర్దారీ తాజా ఇండియా పర్యటన సందర్భంలో గుర్తు చేసుకున్నారు.   ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న జర్దారీ, కాశ్మీర్‌కు వెళ్లే అవకాశం లేనందున ఈ పందెంలో తానే విజయం సాధించానని, తనకు జర్దారీ ఒక రూపాయి బాకీ పడ్డారని ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్ము, కాశ్మీర్‌లో పాకిస్థాన్ నాయకుల పర్యటన ఎంతో కాలంగా పెండింగ్‌లోనే ఉందని ఆయన చమత్కరించారు. ఇంకెప్పుడు పాక్ నేతలు ధైర్యంగా కాశ్మీర్ లో పర్యటించే అవకాశం వస్తుందో మరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Master blaser sachin tendulkar is the best keti perry
Curfew in hyderabad only city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles