Curfew in hyderabad only city

curfew in hyderabad only city

curfew in hyderabad only city

18.gif

Posted: 04/08/2012 04:45 PM IST
Curfew in hyderabad only city

           ak_inn  హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఘర్షణల మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భద్రతా విషయంలో రాజీ పడరాదని సీఎం ఆదేశించారు.  మాదన్నపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
            మరోవైపు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అవసరమైతే మరిన్ని బలగాలు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రమంతా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు.
           ఇదిలా ఉండగా,  అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న మాదన్నపేట, సైదాబాద్, చంచల్‌గూడ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్టు నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే కర్ఫ్యూ విధించినట్టు చెప్పారు. వదంతులను నమ్మొద్దొని ప్రజలను కోరారు. అదనపు బలగాలు మొహరిస్తున్నామని, ఆందోళన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఏకే ఖాన్ తెలిపారు.patabasti33

             ఇదిలా ఉండగా, మాదన్నపేట్ ఘటనకు నిరసనగా భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఇవాళ ఆదివారం బోయినపల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. దాడికి పాల్పడిన ఒక వర్గానికి చెందిన దోషులను అరెస్టు చేయకుండా ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు.  కాగా రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో మరి కొందరు కార్యకర్తలు ఠాణా చేరుకున్నారు. భజరంగదళ్, వీహెచ్‌పీ, బీజేవైఎం కార్యకర్తల అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పోలీసుల వైఖరి నశించాలని కొద్దిసేపు నినాదాలు చేశారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I am the winner omar abdhullah
Chiru mla resignation accepted by speakar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles