Vangapandu prajadandu party

Vangapandu Prasad Rao launched a new party, Vangapandu Prajadandu for Uttarandhra development. He accused that no one political leader concentrating on Uttarandhra development. He continued, party will be contest in next polls

Vangapandu Prasad Rao launched a new party, Vangapandu Prajadandu for Uttarandhra development. He accused that no one political leader concentrating on Uttarandhra development. He continued, party will be contest in next polls

Vangapandu Prajadandu party.gif

Posted: 04/05/2012 03:49 PM IST
Vangapandu prajadandu party

Vangapandu-Prasada-raoమన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఒకపార్టీ ఆవిర్భవించింది. మరో పార్టీ ఆవిర్భవించబోతుంది.
ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు... అదేనండి ‘‘ఏం పిల్లడో ఎల్డ వస్తవా..’’ అనే పాటతో ప్రజల అభిమానాన్ని కూడగట్టుకున్న వంగపండు ఇప్పుడు రాజకీయ పార్టీని స్థాపించాడు. ‘‘ప్రజాదండు’’ పేరుతో ఈయన రాజకీయ పార్టీని స్థాపించారు. ‘ఉత్తరాంధ్ర అభివ్రుద్ది, ఆత్మగౌరవం’ అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించారు.

గత కొన్ని రోజుల నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి సమైక్యాంధ్ర నినాదంతో పోరాడుతున్న వంగపండు... ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబాటు తనాన్ని, పాలక వర్గాల నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించేందుకు, అందరికి సామాజిక న్యాయం అందాలనే నినాదంతో ఈ పార్టీ స్థాపించినట్లు వంగపండు తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్ తరువాత ప్రజా వాగ్గేయకారుడిగా పేరొందిన వంగపండు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధం అని ప్రకటించారు.

మరో కొన్ని రోజుల్లో ఎమ్మార్పీఎస్ నేత మందక్రిష్ణ మాదిగ కూడా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తిరుపతిలో ప్రకటించారు. ఇక తెలుగు దేశం పార్టీ నుండి బయటికి వచ్చిన నాగం జనార్థన్ రెడ్డి కూడా ఓ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. మరి ఇన్ని రాజకీయ పార్టీల్లో చివరి వరకు నిలిచే పార్టీలెన్నో చూడాలంటున్నారు ప్రజలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana counter
Corrupt cm kiran govt shunts honest acb chief after liquor syndicate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles