One out of 30 babies born in us is a twin

Twin, Fertility treatment, Maternal age

Women conceiving at older ages, thanks to the availability of fertility treatments, has spurred the birth of twins.

One out of 30 babies born in US is a twin.gif

Posted: 04/04/2012 01:28 PM IST
One out of 30 babies born in us is a twin

twinsపెద్ద వయస్సులో గర్భం దాల్చిన వారికి కవలలు జన్మిస్తున్న విషయాన్ని ఇటీవల పరిశోధకులు గుర్తించారు. సంతాన సాఫల్యత పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో లేటు వయస్సులో కూడా పిల్లలను కనే అవకాశం మహిళలకు వరంగా మారింది. అయితే వీరు కవలలకు జన్మనిస్తున్నారని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అమెరికాలో చేపట్టిన అధ్యయనంలో తేలింది. అమెరికాలో 2009 సంవత్సరంలో ప్రతీ 30 జననాల్లో ఒక కవల జంట ఉందని పేర్కొన్నారు.

కాగా ఈ సంఖ్య 1980లో ప్రతీ 53 జననాల్లో ఒక కవలగా ఉందని తెలిపారు. కవల పిల్లల జననాలు అన్ని వయస్సు మహిళల్లో పెరిగిందని, అయితే 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఇది ఎక్కువగా ఉందని పరిశోధకురాలు బార్బారా ల్యూక్‌ పేర్కొన్నారు. ఎక్కువ వయస్సులో గర్భం ధరించేవారి సంఖ్య మూడింట ఒకవంతు పెరుగగా, సంతాన సాఫల్యత చికిత్సల మూలంగా గర్భ ధరించేవారి సంఖ్య మూడింట రెండువంతులు పెరిగిందని బార్బారా తెలిపింది. వీరి పరిశోధన ప్రకారం అమెరికాలో 12 శాతం మహిళలు సంతాన సాఫల్యత చికిత్సను పొందుతున్నారని తేలింది. ఒకే సారీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చే కేసులు కూడా పెరిగాయని ఆమె అన్నారు. 2009లో 651 జననాల్లో ఒక ట్రిప్లెట్‌ ఉండగా, 1980లో 2702 జననాల్లో ఒకటిగా ఉందని వెల్లడించారు. ఎక్కువమంది ఒకేసారి జన్మిస్తే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని బార్బారా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pregnant woman diet affects child obesity risk
James cameron reshot titanic 3d scene  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles