When did gandhi become father of nation asks rti govt clueless

When did Gandhi become Father of Nation asks RTI govt clueless,Right to Information Act, RTI, Mahatma Gandhi, father of nation, Aishwarya Parashar, PMO,

When did Gandhi become Father of Nation asks RTI govt clueless

Gandhi.gif

Posted: 04/04/2012 09:40 AM IST
When did gandhi become father of nation asks rti govt clueless

When did Gandhi become Father of Nation asks RTI govt clueless

శివ ధనుస్సు ఎవరు విరక్కొట్టార్రా అని ఒక డిఇఓ ప్రశ్నించాడట. దీనికి స్కూల్లో ఉన్న ప్రతి కుర్రాడు నేను కాదంటే నేను కాదు అన్నారట. ఇదంతా చూసి తలపట్టుకున్న క్లాసు టీచరు శివధనుస్సు విరిగిపోయిన సంగతి డిఇఓ గారి దృష్టికి వెళ్లిందని హెడ్‌మాస్టారు చెవిలో చేరేశాడట. దాంతో హెడ్‌మాస్టారు మరింత ఖంగారు పడిపోయి సార్‌ సార్‌ కొంచెం ఆగండి వాడొవడో కనుక్కుని వీపుచీరేస్తాను అంటూ బెత్తం పట్టుకుని బయల్దేరాడట.

సరిగ్గా ఇటువంటిదే కేంద్ర ప్రభుత్వానికి ఎదురైంది. కాకపోతే ప్రశ్న అడిగింది ఒక చిన్నారి బాలిక. పేరు ఐశ్వర్య పరాశర్‌. వయసు పదేళ్లు. ఆరోతరగతి చదువుతోంది. ఈ అమ్మాయికి చాలా విచిత్రమైన సందేహం వచ్చింది. మహాత్ముగాంధీని జాతిపిత అని ఎవరు ఎప్పుడు ఏ ఆర్డర్‌ ద్వారా ప్రకటించారు? అటువంటి ఆర్డర్‌ ఏదైనా ఉందా? ఉంటే దాని నకలు నాకు పంపించండి అని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ప్రశ్నించింది. దీంతో కేంద్ర అధికారులకు బుర్ర తిరిగిపోయింది. ఈ ప్రశ్న బాంబు ముందుగా ప్రధాని కార్యాలయానికి వెళ్లింది. అక్కడి వాళ్లు జుట్టుపీక్కుని ఇట్లాంటి ఆర్డర్‌ మేం పాస్‌ చేయలేదు అని ఒక వేళ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏమైనా పాస్‌ చేసిందేమోనని వాళ్లకు ఫర్వార్డ్‌ చేశారు. పిఎం ఆఫీసు నుంచి లెటర్‌ వచ్చింది అంటే ఏ 2జిస్కామో, కోల్ స్కామో తాలూకు వివరాలకోసమేమో అనుకుంటూ ఈ చిన్నారి వేసిన ప్రశ్న చూసి గుడ్లు తేలేశారు.

When did Gandhi become Father of Nation asks RTI govt clueless

ఇటువంటి ప్రకటనలు తామెన్నడూ చేయలేదని, ఒక వేళ గతంలో చేసి ఉంటే నేషనల్‌ ఆర్చీవ్స్‌లో ఉండి ఉంటుందని వాళ్లకు ఈ ప్రశ్నను బదిలీ చేసి సమాధానం చెప్పమన్నారట. అక్కడి వాళ్లు మొత్తం డిపార్టుమెంటు గాలించి మహాత్ముడిని జాతిపితగా ప్రకటించిన కాగితం ముక్క ఏదీ తమ దగ్గర లేదని నొక్కి వక్కాణించి చాలా తెలివిగా సమాధానం చెప్పారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఉన్న రికార్డులలోని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే తమపై ఉందని, పరిశోధన చేసి చెప్పాల్సిన బాధ్యత తమకు లేదని సమాధానం ఇచ్చారు. అంతేకాదు, ఆ పదేళ్ల పాప కావాల్సివస్తే మొత్తం పబ్లిక్‌ డాక్యుమెంట్సు పరిశీలించుకుని కావాల్సిన సమాచారం తీసుకోవచ్చని కూడా అన్నారు. అయ్యా అదీ సంగతి.
ఇంతకీ మహాత్ముడు జాతిపిత ఎలా అయ్యాడు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Transgender model jenna allowed to run for miss universe
7 students killed in us university shootout  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles