Kiran vs bosta

Kiran Vs Bosta, CM Kiran Kumar Reddy,PCC Chief Bosta Satyanarayana, Kiran Syndicate. Liquor Scam,

Kiran Vs Bosta

Kiran.gif

Posted: 03/30/2012 11:10 AM IST
Kiran vs bosta

Kiran Vs Bosta

మద్యం సిండికేట్ల వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఇరికించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్లలో బొత్స, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లుగా నివేదికలో పొందుపరిచేందుకు ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ ద్వారా ఆ జిల్లాలోని ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్ళు తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ముఖ్యమంత్రి పరిధిలో ఉండడంతో మద్యం సిండికేట్ల విచారణలో భాగంగా ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ కే శ్రీనివాసడ్డి ద్వారా మంత్రి బొత్స అయన కుటుంబసభ్యుల పేర్లను చేర్చేందుకు సీఎం ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ నేరుగా విజయనగరం రేంజ్ ఏసీబీ ఇన్స్‌పెక్టర్ ఎంవీ గణేశ్‌ను ఈనెల 26న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు పిలిపించుకుని తాను చెప్పినట్లుగా మంత్రి బొత్స అతని కుటుంబసభ్యులు మద్యం సిండికేట్లలో ఉన్నట్లుగా ఎందుకు రిపోర్టు ఇవ్వలేదంటూ నానా దుర్భాషలాడినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న సీఐ గణేశ్ మనస్థాపానికి గురై తన న్యాయవాది ఎల్‌ఎస్ నాయుడు ద్వారా ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసడ్డికి రూ10లక్షల పరువునష్టం నోటీసు పంపారని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jagruthi president kavitha
1500 kg gold from discarded phones  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles