Bs yeddyurappa arrives in delhi return as karnataka chief

BS Yeddyurappa arrives in Delhi, return as Karnataka Chief,Karnataka chief minister, Karnataka crisis, Yeddyurappa, Yeddyurappa vs BJP

BS Yeddyurappa arrives in Delhi, return as Karnataka Chief

Yeddyurappa.gif

Posted: 03/22/2012 10:44 AM IST
Bs yeddyurappa arrives in delhi return as karnataka chief

 BS Yeddyurappa arrives in Delhi, return as Karnataka Chief

ఉడిపి-చిక్మగళూర్‌ లోక్‌ సభా నియోజక వర్గంలో పార్టీ ఓటమితో దిగ్భ్రాం తి చెందిన బిజెపి తిరిగి ఎడ్యూరప్పను ముఖ్య మంత్రి గద్దెపై కూర్చో బెట్టేలా కన్పిస్తోంది. గత 18 ఏళ్ళుగా ఆ సీటు బిజెపిదే. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడీ పరాజయం బిజెపికి మింగుడు పడటం లేదు. అంతకంటే ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఈ సీటు ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడది. ఆయన కర్నాటక అసెంబ్లీకి వచ్చేందుకుగానూ ఈ సీటుకు రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఎడ్యూరప్పను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై నిలపాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తోంది. బహుశా 24 గంటల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. తన డిమాండ్‌ను అంగీకరించాలంటూ ఎడ్యూరప్ప బహిరంగంగానే పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం పార్టీకి అంత తేలిక కాదు. తనను ముఖ్యమంత్రిగా చేయడానికి ఎడ్యూరప్ప 48 గంటల గడువు విధించారు. తనకు 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ నాయకత్వంపై మరింత ఒత్తిడి కూడా తెచ్చారు. ఒకవేళ తన డిమాండ్లు నెరవేరకపోతే పార్టీని చీల్చి కొత్త పార్టీ పెడతానని కూడా హెచ్చరించారు. చివరికి ఇదంతా చూస్తుంటే శక్తివంతమైన ప్రాంతీయ నేతల ఆకాంక్షలను, ఆశలను అదుపు చేయడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా ఎడ్యూరప్ప గతంలో కూడా ఇలాగే సమస్య సృష్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Judge recommends 1 5 million to enslaved indian maid
Air sales  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles