Julakanti srinivasa reddy

julakanti srinivasa reddy,Julakanti Srinivas Reddy, Photos - Julakanti Srinivas Reddy, Videos - Julakanti Srinivas Reddy.Julakanti Srinivas Reddy, YS Jagan, Farmers, six ministers, Guinness World Records, assembly ,

julakanti srinivasa reddy

julakanti.gif

Posted: 03/20/2012 10:39 AM IST
Julakanti srinivasa reddy

julakanti_srinivasa_reddy

శాసనసభను వాయిదా వేయడంలో గిన్నిస్‌ బుక్‌ రికార్డులను తిరగరాస్తున్నారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. సభ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగనప్పుడు సభ్యులు హాజరై ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దాటవేయడాన్ని తప్పుబట్టారు. జగన్‌ ఆస్తుల విషయంలో ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చిన నేపథ్యంలో సదరు జీవోల ఫైళ్లను సభ ముందు ఉంచడానికి ప్రభుత్వం ఎందుకు జంకుతోందని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు గ్రామాలు, పట్ణణాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాల కోసం పోరాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి మాత్రం ఇవేమీ పట్టడం లేదని విమర్శించారు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించాలని కోరారు. లేదంటే ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Effect of meat dairy on heart health
Chiranjeevi clarifies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles