Asia cup cricker bharat vs pakistan

asia cup, cricker bharat, vs pakistan

asia cup cricker bharat vs pakistan

1.gif

Posted: 03/18/2012 06:35 PM IST
Asia cup cricker bharat vs pakistan

           పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన భారత క్రికెట్ జట్టు ... తమ కసినంతా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చూపించింది. ఏకంగా తమ వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని (330) ఛేదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. భారత యువ ఆటగాడు.. విరాట్ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించడంతో పాక్ బౌలర్లు మైదానంలో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది.           

            ఫలితంగా.. మరో ఆరు బంతులు మిగిలివుండగానే.. టీమ్ ఇండియా చిరకాల పత్యర్థిపై మరోమారు పైచేయి సాధించింది. దీంతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. టోర్నీలోని ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలిస్తే భారత్ ఫైనల్‌కు చేరుతుంది.           భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇన్నింగ్స్ రెండో బంతికే ఔపెనర్ గంభీర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ సచిన్‌తో జతకట్టిన యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. విరాట్ కోహ్లి 148 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 183 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు, సచిన్ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 83 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు.             

           గంభీర్ మినహా సచిన్, కోహ్లీ, రోహిత్ శ్రమలు సమిష్టిగా రాణించి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంతో 329 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఆరు బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కళ్లముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నప్పటికీ.. భారత బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం తడబాటు లేకుండా చెలరేగి ఆడటం గమనార్హం.           

pak_indi.jpeg

 అంతకుముందు పాకిస్థాన్ ఊదరగొట్టింది. పరుగుల వరద పారించి రెండు సెంచరీలతో  టీమిండియాకు 330 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. ఓపెనర్లు హఫీజ్(105), జంషెడ్(112) సెంచరీలతో ఆదరగొట్టారు. యూనిస్ ఖాన్(52) అర్థసెంచరీతో తనవంతు పాత్ర పోషించాడు.
            అయితే, ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో రైనా పట్టిన అద్భుత క్యాచ్ తో యూనిస్ పెవిలియన్ చేరాడు. ఉమర్ అక్మల్ 28, ఆఫ్రిది 9, ఆజామ్ 4 పరుగులు చేశారు. మిస్బా(4), గుల్(0) నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్, ధిండా రెండేసి వికెట్లు పడగొట్టారు ఇర్ఫాన్ పఠాన్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.
          కాగా, లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుఎబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గంభీర్ డకౌట్ అయ్యాడు. పాక్ హఫీజ్ బౌలింగ్ లో గంభీర్ ఎల్బీగా వెనుదిరిగాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kurnool police had not arrested bhanu
Australia womens cricket team beat indian women in 2020 match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles