పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఎర్త్ అవర్-2012 కార్యక్రమానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచాడు. భూతాపాన్ని తగ్గించేందుకు ఏడాదిలో ఓ గంటపాటు ప్రతి ఒక్కరు తమ విద్యుత్ దీపాలను ఆర్పివేయాలంటూ డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ కొంత కాలంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా సచిన్ వీరితో చేతులు కలిపాడు. ఈ నెల 31న జరిగే ఎర్త్ అవర్ కార్యక్రమంలో దేశంలోని ఆయా నగరాల్లోని సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో లైట్లను ఆర్పివేయాలని సచిన్ కోరాడు. ఈనేపథ్యంలో ఏ సిటీలోనైతే ఎక్కువ మంది ఈ ఉద్యమంలో పాల్గొంటారో ఆ నగరాన్ని ఎర్త్ అవర్ చాంపియన్గా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది 135 దేశాల్లోని 5,200 నగరాలు ఎర్త్ అవర్లో పాల్గొంటున్నాయి. 1.8 బిలియన్ ప్రజలు పాల్గొని రికార్డు సృష్టించారు. భారత్లో 130 నగరాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా ఉండడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more