Mercedes benz creates an invisible car

EVERYONE from Harry Potter to Frodo Baggins has already got an invisibility cloak.entire car, Mercedes Benz, Mercedes Benz The, invisible, newsimagefil

EVERYONE from Harry Potter to Frodo Baggins has already got an invisibility cloak.entire car, Mercedes Benz, Mercedes Benz The, invisible, newsimagefil

Mercedes Benz creates an invisible car.gif

Posted: 03/12/2012 02:44 PM IST
Mercedes benz creates an invisible car

Benz-invisible-carమెర్సిడెస్ బెంజ్‌కు చెందిన ఆర్ అండ్ డీ నిపుణులు ఒక అదృశ్య కారును తయారుచేయాలనుకున్నారు. అదృశ్యం అంటే అర్థం ఏమిటి? ఎదురుగా ఒక వస్తువు ఉన్నా.. అది కనిపించకుండా దాని అవతల ఉన్నది కనిపించడం. దీనికే కొత్త అర్థం తీశారు బెంజ్ నిపుణులు. తాము కొత్తగా తయారుచేసిన కాలుష్య రహిత కారు 'ఎఫ్-సెల్'కు డ్రైవరు ఉండే వైపున ఎల్ఈడీలను ఒక పట్టాలాగా కూర్చారు. కారుకు అవతలి వైపున ఒక కెమెరాను ఉంచారు. ఆ కెమెరాకు, ఈ ఎల్ఈడీ తెరకు కనెక్షన్ ఇచ్చారు. కారుకు అవతలివైపున ఉండే దృశ్యాలను చిత్రీకరించే కెమెరా వాటిని ఎల్ఈడీ తెరపైన ప్రదర్శిస్తుంది. అంతే..! అదృశ్య కారు రెడీ! అంతా బానే ఉందిగానీ.. ఈ కారు చక్రాల మీద ఎల్ఈడీలు లేకపోవడంతో కారున్న విషయం తెలిసిపోతోంది.

ఈ కారును తయారుచేశాక, జర్మనీలో వారం రోజుల పాటు తిప్పారు. ఆ వీడియోలను తీసి యూట్యూబ్‌లో ఉంచారు. రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తున్న ఈ అదృశ్యకారును చూసి అంతా నోరెళ్లబెట్టినట్టుగా ప్రచార వీడియోల్లో చూపించారు. అయితే.. ఈ వీడియోలు చూసిన కొందరు ఆన్‌లైన్ యూజర్లు మాత్రం దీనివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని విమర్శిస్తున్నారు.

ఈ కారువల్ల ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. కొంతమంది అతితెలివి కొద్దీ వీటిని ఎక్కడపడితే అక్కడ పార్క్‌చేసే ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఇంతకీ.. మెర్సిడెస్ బెంజ్ పనిగట్టుకుని ఇలాంటి కారు ఎందుకు తయారు చేసిందో ఊహించగలరా? తాము రూపొందించిన కారు పూర్తిస్థాయిలో కాలుష్యరహితమని, పర్యావరణానికి ఎలాంటి హానీ చేయదని.. అసలు కర్బన ఉద్గారల పరంగా తమ కారు ఉన్నా లేనట్టేనని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan singh office now on youtube
Tirupathi mla and congress leader chiranjeevi says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles