Manmohan singh office now on youtube

YouTube,United Progressive Alliance,Twitter,PMOfficeIndia,Pankaj Pachauri,Mahatma Gandhi,Facebook

Having successfully ventured into social media to connect with on-the-go generation, Prime Minister Manmohan Singh's office has now forayed into video website YouTube.

Manmohan Singh.gif

Posted: 03/12/2012 03:05 PM IST
Manmohan singh office now on youtube

Manmohan-singhభారత ప్రధాని మన్మోహన్ సింగ్ తాజా ట్విట్టర్ లో చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూ ట్యూబ్ లో కూడా చేరారు. యూ ట్యూబ్ లో అకౌంట్ ఉండదు కదా ? అదేం సోషల్ నెట్ వర్కింగ్ సైటు కాదు కదా ? మరి అందులో చేరడం ఏంటి అనేగా మీ సందేహం. ప్రధాని యూ ట్యూబ్ లో చేరడం అంటే... ప్రధాని కార్యక్రమాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పుడు వీడియో చిత్రాల వెబ్‌సైట్‌ యూట్యూబ్‌లోనూ ఉంచబోతుంది. ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ పాల్గొనే కార్యక్రమాల వీడియో చిత్రాలు ఇక నుంచి మనకు యూట్యూబ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమాలను ఇప్పుడు యూట్యూబ్ లో తిలకించవచ్చు. ప్రధానమంత్రికి సమాచార సలహాదారుగా టీవీ జర్నలిస్టు పంకజ్‌ పచౌరి నియమితులైన తరువాత ప్రధాని కార్యాలయం ఇలా వెబ్‌సైట్‌లపై దృష్టి సారించింది.

దీనిలో భాగంగా యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ)పై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రసంగించిన వీడియో చిత్రాన్ని యూట్యూబ్‌లో శనివారంనాడు తొలిసారిగా పొందుపరిచారు. రెండో కార్యక్రమంగా గత ఏడాది అక్టోబర్‌ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సందర్శిం చినప్పటి వీడియో చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.ఈ సందర్భంగా ప్రధాని కార్యా లయం అధికారి ఒకరు మాట్లాడుతూ వీడియో చిత్రం ద్వారా కార్యక్రమాలను ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చేయవచ్చని వ్యాఖ్యానించారు.

మరి ప్రధాని ట్విట్టర్ లో చేరితే బికినీ ఫోటోతో స్వాగతం పలికిన మోడల్ పూనమ్ పాండే ఈసారి నగ్నంగా ఉండే ఫోటోతో వెల్ కం చెబుతుందేమోనని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High speed trains in india
Mercedes benz creates an invisible car  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles