Rajanarasimhas speech at international chamar

Dy Chief Minister Rajanarasimha's speech at International Chamar Mahasabha

Dy Chief Minister Rajanarasimha's speech at International Chamar Mahasabha

Dy Chief Minister.GIF

Posted: 03/12/2012 01:16 PM IST
Rajanarasimhas speech at international chamar

Rajanarasimhaరాబోయే ఇరవై ముప్పయ్యేళ్లలోపు ఈ దేశాన్ని పాలించే సత్తా మాదేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చమార్ సమావేశంలో అన్నారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎల్బీ స్డేడియంలో జరిగిన అంతర్జాతీయ చమార్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చమార్ సమావేశానికి అనేక మంది ఇబ్బందులు సృష్టించారని అన్నారు. ఈ దేశ మూలవాసులుగా ఆస్తి మాది అన్నారు. భవిష్యత్తు తమదనని, అసమానతలు, అన్యాయం, అవహేళన ఎక్కడ ఉంటే అక్కడ తిరగబడతామమన్నారు. భవిష్యత్తులో పాలించే పాలించే సత్తా మనదేనని ఆ దిశగా సంఘటితమై ముందుకు వెళదామని చమార్లకు పిలుపునిచ్చారు. 18 ఏళ్ల తరువాత రాష్ట్రంలో తొలిసారిగా ఒక చమార్‌కు ఉప సిఎం పదవి లభించిందని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలుంటే చమార్‌లు తిరగబడతారని హెచ్చరించారు. ధార్మిక చింతన ద్వారా సమాజంలో చైతన్యం తేవాలని, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సంఘటితం కావాలని చమార్లకు ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Subbishetty died
Rtc launch new vennela service to tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles