ఉపఎన్నికల్లో ఎలాగైనా పరువుదక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయపార్టీలూ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలకు పరాభవాలు తప్పటం లేదు. ఈ చేదు అనుభవం తాజాగా సినీ నటులు, రాజకీయనేతలైన రోజా, బాబూమోహన్ కు ఎదురైంది.
నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో భాగంగా కోవూరులో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సినీనటి రోజా ప్రచారం నిర్వహిస్తూ మహిళా సంక్షేమానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాటుపడితే కిరణ్‌కుమార్ మహిళపై అధిక భారాలు మోపుతున్నారని ఆమె విమర్శించారు. డ్యాన్సు పోగ్రాం ఏర్పాటు చేసి కార్యకర్తలను కూర్చోబెట్టే పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చిందని ఆమె ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా చిరంజీవి పై రోజా విమర్శలు చేస్తున్న తరుణంలో అక్కడి జనంలో తీవ్ర అలజడి రేగింది. రోజా పై ప్రజానీకం పరుష పదజాలంతో రంకెలు వేశారు. రోజా డౌన్ డౌన్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేయటంతో రోజా తన ప్రసంగాన్ని వేరే అంశాలకు మరల్చారు.
ఇక ఉప ఎన్నికలో భాగంగా టిడిపి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న మాజీమంత్రి, టిడిపి నేత బాబూమోహన్ వాహనంపై తెలంగాణ వాదులు కోడిగుడ్లతో దాడిచేశారు. నాగర్‌కర్నూలు అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు బాబూమోహన్ నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
బస్టాండ్ వద్ద రోడ్‌షో నిర్వహిస్తుండగా వాహనంపై తెలంగాణ వాదులు కోడిగుడ్లు విసిరారు. టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో టిడిపి కార్యకర్తలకు, తెలంగాణ వాదుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more