Commandant home guards four constables held for salary scam

Commandant Home Guards, four constables held for Salary scam,Home Guard commandant, July 2011 to January 2012,commandant J. Krishnaiah

Commandant Home Guards, four constables held for Salary scam

Commandant.gif

Posted: 03/10/2012 05:45 PM IST
Commandant home guards four constables held for salary scam

Commandant Home Guards, four constables held for Salary scam

పోలీసు ఉన్నతాధికారే 'దొంగ వేషాలు' వేశారు. మరో నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి.. విధుల్లో లేని హోంగార్డుల పేరిట డబ్బులు కాజేశారు. ఏడు నెలలుగా జరుగుతున్న ఈ భాగోతం బయటపడడంతో వారంతా అడ్డంగా దొరికిపోయారు. తీరిగ్గా ఊచలు లెక్కబెడుతున్నారు. 2011 జూలై నుంచి కొందరు హోంగార్డులు విధుల్లో లేకున్నా.. రాజీనామా చేసి వెళ్లిపోయినా.. వారి పేరిట జీతాల చెల్లింపులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

వారు విధుల్లోనే ఉన్నట్లుగా చూపిస్తూ.. హోంగార్డ్ విభాగం కమాండెంట్ జే కృష్ణయ్య, మరో నలుగురు కానిస్టేబుళ్లు.. ఏ వినయ్‌కుమార్, ఆర్ సాయిరాం, ఏ ప్రశాంత్, ఎండీ హబీబ్అన్వర్‌లు ఆ సొమ్మును కాజేశారు. ఈ విషయం తెలిసిన రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ బాల్‌రెడ్డి ఈ తతంగానికి సంబంధించి మీర్‌చౌక్ పోలీసులకు ఫిబ్రవరి 26న ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కానిస్టేబుల్ వినయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో.. బండారం బయట పడింది.

కాజేసిన మొత్తం రూ. 8 లక్షల 74 వేలలో సింహభాగం తాము కమాండెంట్ కృష్ణయ్యకే ఇచ్చినట్లు కానిస్టేబుళ్లు అంగీకరించారు. మొత్తంగా.. 146 మంది హోంగార్డుల అలవెన్సులు, ఫీడింగ్ చార్జీలు, పరేడ్ అలవెన్సులు కలిపి రూ. 8,74, 464 నిందితులు కాజేశారు. దీనిపై విచారణ చేసిన మీర్‌చౌక్ ఏసీపీ ఎం.కృష్ణయ్య పూర్తి ఆధారాలతో కమాండెంట్ కృష్ణయ్య మిగతా నలుగురు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Avatar
Is katy perry dating the worlds highest paid male model  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles