Akhilesh yadav to be uttar pradesh cm

Uttar Pradesh CM, Akhilesh Yadav, Samajwadi Party, Mulayam Singh Yadav, Azam Khan, nation news

Akhilesh Yadav to be Uttar Pradesh CM - Barring a last minute hitch, Akhilesh Yadav will be the chief minister of Uttar Pradesh

Akhilesh Yadav.GIF

Posted: 03/10/2012 11:51 AM IST
Akhilesh yadav to be uttar pradesh cm

Yadavఉత్తరప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఖంగుతినిపించి మ్యాజిక్ ఫిగర్ 224 సీట్లను గెలుచుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సమాజ్ వాజ్ పార్టీ. ఎన్నికల తరువాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగా ? లేక పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించిన ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవా ? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి యూపీ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చునేది తండ్రా ? తనయుడా ? అనే సస్పెన్స్ వీడనుంది.

సమాజ్‌వాదీ పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపిన అఖిలేష్.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీని విజయపథంలో నడిపిన సంగతి తెలిసిందే. మాయావతి పరాజయానికి బాటలు పరిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్‌సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి కానున్నారు. ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ కే బాధ్యతలను అప్పగించనున్నారు. . రెండు రోజుల కిందట జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొంతమంది అఖిలేష్‌కు మొగ్గు చూపితే.. మరికొందరు ములాయమే మళ్లీ సీఎం కావాలని పట్టుబట్టారు. కానీ అఖిలేష్‌నే ముఖ్యమంత్రిని చేసేలా పార్టీ సీనియర్లను సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ ఒప్పించారని సమాచారం. నేడు జరిగే పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించనున్నారు.

అయితే మొన్నటి వరకు ములాయం సింగే యూపీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన అఖిలేష్... తన తండ్రి మాటను కాదనలేక, తన తండ్రి అనారోగ్యం కారణాల వల్ల బాధ్యతలను చేపట్టడానికి అంగీకరించాడని అఖిలేష్ అంగీకరించాడని తెలుస్తుంది. ఇప్పుడు అఖిలేష్ వయసు 38! యూపీలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. అప్పట్లో మాయావతి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న వనితా రికార్డు కెక్కారు. అప్పడు ఆమె వయస్సు 39. కానీ ఆమె రికార్డును అఖిలేష్ తుడిసివేయ నున్నారు. మొత్తానికి యూపీ ముఖ్యమంత్రి పీఠం పై అఖిలేష్ యాదవ్ కూర్చోనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed pursuing gali empire in 6 countries
Suchitra mahato surrenders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles