Festival enjoy is seven members

festival enjoy is seven members, congress Party, Bsp party, BJP party, seven MLAs ,

festival enjoy is seven members

festival.gif

Posted: 03/08/2012 09:57 AM IST
Festival enjoy is seven members

ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఊహకు అందని రాజకీయ మలుపులు ఉంటాయి. పర్వత ప్రాంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో కాంగ్రెసు-బిజెపి మధ్య ఒక్క సీటు తేడా రావడంతో అధికార పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఉత్కంఠ భరితంగా మారింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెసు 32 సీట్లు గెల్చుకోగా, బిజెపి 31 సీట్లు సాధించిన నేపథ్యంలో 'కింగ్‌ మేకర్ల'యిన ఏడుగురు ఎమ్మెల్యేలు (ముగ్గురు బిఎస్పీ, నలుగురు స్వతంత్ర) పండగ చేసుకుం టున్నారు. 'మేజిక్‌ ఫిగర్‌' 36 సాధించాలంటే కాంగ్రెసుకు నలుగురు, బిజెపికైతే ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం. కాబట్టి ఆ ఏడుగురు ఎమ్మెల్యేల చేతుల్లోనే కాంగ్రెసు, బిజెపి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిజెపి మళ్లీ దాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతుండగా, కొత్తగా అధికారంలోకి రావాలని కాంగ్రెసు కలలు కంటోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఆ ఏడుగురు అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు, మచ్చిక చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల 'బలహీనత'ను ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు 'క్యాష్‌' చేసుకుంటున్నారు. ఈ ఏడుగురిలో ముగ్గురు కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థులే. కాంగ్రెసు నాయకులు రాష్ట్ర గవర్నర్‌ మార్గరెట్‌ ఆల్వాను కలుసుకొని అసెంబ్లీలో తమదే పెద్ద పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని కోరారు. తాము సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి బీరేందర్‌ సింగ్‌, పిసిసి అధ్యక్షుడు యశ్‌పాల్‌ ఆర్యా తదితరులు నమ్మకంగా చెబుతున్నారు. ఏడుగురిలో ఉన్న ముగ్గురు కాంగ్రెసు తిరుగుబాటు ఎమ్మెల్యేలు సహా యుకెడి (పి) ఎమ్మెల్యే మద్దతు కూడా సంపాదిస్తామంటున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై బిజెపి కూడా నమ్మకంగా ఉంది. నాలుగోసారి విజయం సాధించిన బిజెపి రాష్ట్ర అధ్య్‌క్షుడు బిషన్‌ సింగ్‌ చౌపాల్‌ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ హైకమాండ్‌ కోరితే సింఎం పదవిని చేపడతానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridhar babu s ingenious twist
Jc diwakar reddy comments on rahul  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles