Obama invokes gandhi mandela

barack obama, mahatma gandhi, nelson mandela,barack obama, mahatma gandhi, nelson mandela

US President Barack Obama invoked the legacies of his heroes Mahatma Gandhi and Nelson Mandela as he sought support from voters for a second term, saying he too needs time to fulfil his

Obama invokes Gandhi_Mandela.gif

Posted: 03/05/2012 06:03 PM IST
Obama invokes gandhi mandela

Obama‘కూటి కోసం కోటి విద్యలు’ అన్నట్లు ఇక్కడ అధికారం కోసం కోటి తిప్పలు పడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు రకాలుగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓటు కోసం ఆయన సింగర్ అవతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో విధంగా ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఈసారి ఆట పాట కాకుండా గొప్ప మహానుబావులను ఆదర్శంగా తీసుకొని ఆయన వాళ్ళలా ఫీలయిపోయి మరీ ప్రసంగాలు చేస్తున్నాడు.

ఎన్నికల్లో గెలుపు కోసం మహాత్మాగాంధీ, జాతివివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా పేర్లను జపిస్తున్నారు. అమెరికాలో నిజమైన మార్పు తెచ్చేందుకు వారిలా తాను కూడా కష్టపడతానని, తన హామీలను నె రవేర్చేందుకు తనను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికోవాలని ఓటర్లను కోరారు. ‘గాంధీ, నెల్సన్ మండేలా చేసింది చాలా కష్టమైన పని, దానికి చాలా సమయం కావాలి. అమెరికాలో నిజమైన, పెద్ద మార్పు చాలా కష్టం. అందుకు ఒక పర్యాయం(అధ్యక్ష పదవి) కంటే ఎక్కువ కావాలి. ఒక అధ్యక్షుడు, ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది కావాలి’ అని అన్నారు.

2008 ఎన్నికల్లో తాము ఆశించిన మార్పు ఇంకా వేగంగా రావడం లేదని పేర్కొన్నారు. ప్రజలు తనతో చేతులు కలిపి పనిచేస్తే దేశంలో మార్పు వస్తుందని చెప్పుకొచ్చారు. మరి ఒబామా వేసే మంత్రాలకు ఓట్లు రాలతాయో లేదో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri durga malleswara swamy temple
Earthquake in new delhi and northern areas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles