ఇంగ్లండ్ లో దుర్భరజీవితాన్ని (ఒకవేళ దాన్నీ ఒక జీవితమంటే) అనుభవిస్తున్నవారు వేలల్లో ఉన్నారు. వాళ్ళంతా విదేశీ కాసులకోసం అయినవారికి దూరంగావెళ్ళి, దూరపు కొండలు నునుపన్న సామెత ప్రత్యక్షానుభవాన్ని పొందినవారు. సామెతలోలా కాకుండా ఇది దగ్గర్నుంచి కూడా నునుపే అందుకే చేతికి చిక్కటం లేదు అని కూడా కొందరు అనుకుంటున్నారు. ఇక చిక్కే దారికూడా మూసుకుపోయి వ్యథల్లో చిక్కుకుని కొందరు, వారిలో కలిగే నిరాశా నిస్పృహలను మర్చిపోవటానికి మద్యం, డ్రగ్స్ ని ఆశ్రయించి, మురికి కూపాల్లో నివసిస్తూ, బతుకులు మత్తులోనే వెళ్ళదీస్తున్నారు.
భారత్ లోని ఏజెంట్ల మోసానికి గురై, అక్కడ విద్యార్థి వీసా కాలం తీరిపోయి తిరిగి వెనక్కి రావటానికి ముఖం చెల్లక, పని దొరక్కపోవటంతో చేతిలో సరిపడా డబ్బులు లేకపోవటం, తిరిగి రావటానికైనా దళారులను నమ్ముకుని మరోసారి మోసపోయి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నవారు లీసెస్టర్, బర్మింగ్ హామ్, మాంచెస్టర్ మొదలైన ప్రాంతాల్లో 2010 నాటికే 15500 మంది ఉన్నారని లెక్కతేలింది.
మొన్న ఒక కేరళవాసి విదేశాల్లో ఎలాగోలా దొంగ పాస్ పోర్ట్ సంపాదించుకుని తిరిగి వస్తూ హైద్రాబాద్ లో పట్టుబడ్డాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more