దేశరాజధాని ఢిల్లీ లో అది వజీర్ పూర్ ఇండస్ట్రియల్ ఏరియా. అందులో వెయ్యిమంది వరకూ కార్మికులు రాత్రీ పగలూ పనిచేస్తున్నారు. వారాంతపు శలవులులేవు, పండగ పబ్బాలు లేవు, జాతీయ శలవులు దినాలు కూడా వారికి లేవు. పది సంవత్సరాల తర్వాత ఈ రోజు కార్మికులు వారాంతపు శలవుని అనుభవిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అదో స్టీల్ ప్లాంట్. అక్కడ ఇనుముని కాల్చి స్టీల్ గా చేస్తారు. అది అక్కడున్న వందలాది స్టీలు గృహోపకరణాలు, ఇతర వస్తువులు చేసే కర్మాగారాలకి ముడి సరుకు.
ఇందులోని ఫర్నేస్ లను వేడి చేసిన తర్వాత అది వేడెక్కి పని చెయ్యటానికి సిద్ధమవటానికి గంటల తరబడి సమయాన్ని తీసుకుంటుంది. అందువలన వాటిని ఆర్పకుండా 24 గంటలూ పనిచేయిస్తున్నారు. కార్మికులకు అందే జీతం 5000 నుంచి 8500 వరకూ ఉంటుంది. కానీ వారికున్న తాగుడు లాంటి అలవాట్ల వలన, పెరిగిపోయిన ఖర్చుల వలన వాళ్ళల్లో చాలా మంది అప్పులపాలయ్యారు. అవి అధిక వడ్డీలతో తలమించిన భారమైపోతోంది. ఆరోగ్యస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీలో శీతాకాలంలో చలి ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కదా. అటువంటి రోజుల్లో కూడా ఆ ఫాక్టరీ లో పనిచేసే కార్మికుల గంటకోసారి ఒక లీటరు నీళ్ళు తాగుతారంటే అందులో ఎంత వేడి ఉంటుందో గ్రహించవచ్చు. ఇక ఎండాకాలమైతే సరేసరి. 10 నిమిషాలకోసారి నీళ్ళు తాగుతుండాల్సిందే. ఒంటిలోని నీటి స్థాయి పడిపోతుండటం (డి హైడ్రేషన్) వలన తరచుగా వాళ్ళు జబ్బుపడుతుంటారు. ఎక్కడో ఉన్న ఇఎస్ ఐ హాస్పిటల్ కి పోవటానికైనా వాళ్ళకి ఇఎస్ఐ కార్డులు కూడా లేవు.
అరగంట సేపు పనిచేస్తే అరగంట విశ్రాంతి తీసుకుంటేనే కానీ శరీరంలో శక్తి పూరింపబడని పరిస్థితి నెలకొనివుంది. కానీ ఫాక్టరీ యజమానులు శలవులు ఇవ్వక, కార్మికుల ఇతర కోరికలను చూడకపోవటంతో చివరకు ఫిబ్రవరి 15న సమ్మెకు దిగగా, ఇక మీ అవసరం లేదు మిమ్మల్ని తీసేస్తున్నాం అని యాజమాన్యం ప్రకటించింది. తుదకు యాజమాన్నానికి తలవంచక పట్టుదలతో సమ్మెలో పాల్గొంటూ యూనియన్ల సహకారం కూడా తీసుకోవటంతో ఫిబ్రవరి 24 న యాజమాన్యం దిగివచ్చింది. సరే వారాంతపు శలవులు తీసుకోండని దయ చూపించింది. దానితో ఈ రోజు వాళ్ళంతా శలవులో గడుపుతున్నారు.
అయితే ఇంకా ఎన్నో కార్మికుల కోరికలు, వారి సంక్షేమం ఇంకా అలాగే పట్టించుకోకుండా ఉన్నాయి. సరైన భద్రత లేదు, ఫస్డ్ ఎయిడ్ కిట్స్ లేవు, కనీస వేతనం అమలుచెయ్యటం లేదు, జాబ్ కార్డ్ లేదు. ఎనిమిది గంటలు కాకుండా అక్కడ 12 గంటల షిఫ్ట్ లో కార్మికులు పనిచేస్తున్నారు. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 23 న ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ లో కార్మికుల చట్టాలను సంస్కరించాలంటూ ఆందోళనచేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసన చూపిస్తున్న వేలాది మంది కార్మికులతో నిండిపోయి ఉన్న సమయంలో కూడా ఈ కార్మికులు యధావిధిగా తమ పనిచేసుకుంటూపోయారు. అయితే ఈసారి నిన్న కార్మికులు చేసిన ఆందోళనలో మాత్రం వీళ్ళంతా పాల్గొనటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more