Tribal woman gang raped in front of her husband

tribal woman gang raped in front of her husband, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gang-rape-1-2.gif

Posted: 02/27/2012 01:07 PM IST
Tribal woman gang raped in front of her husband

అర్థరాత్రి నడివీధిలో మహిళ ఒంటరిగా తిరగగలిగిన రోజునే మనకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు అంటూ మహాత్మాగాంధీ భారత జాతికో లక్ష్యాన్ని ఎన్నటికీ అందుకోలేని పెద్దఎత్తైన స్తానంలో ఉంచారని అర్థమౌతోంది. ఆడది ఒంటరిగా కాదు, జంటగా బయటకు వచ్చినా, భర్తతోడున్నా భద్రత లేని రోజులు.

అది విజయనగరం జిల్లా కురుపాం మండలం శ్రీరంపురం మొండెంఖల్లు గ్రామం. నగరాల్లోని వినోదాల స్థాయిలో ఉండకోపోయినా, ఇంకా పాత పద్ధతుల్లోనే బుర్రకథలూ, నాటకాలు, ఆకర్షణీయమైన వస్తువుల అమ్మకాలు జరుగుతుంటాయి. ఆటవిడుపుగా జాతరల్లో ఆనందం పంచుకోవటానికి గిరిజనులు వెళ్తుంటారు. అటువంటి జాతర జరుగుతోంది ఆ గ్రామంలో. ఎంతో మంది వెళ్ళినట్టగా ఆ జాతరకు వెళ్ళిందో గిరిజిన జంట. జాతరనుంచి ఇంటికి పోవటానికి తిరుగు ముఖఁ పట్టేటప్పటికి రాత్రి ఒంటిగంటైంది. దారిలో వారి ఆనందమంతా హారతికర్పూరంలా కాలిపోయింది. వారిని దారిలో 10 మంది యువకులు అటకాయించి వారిని పక్కనున్న పొలాల్లోకి తీసుకునిపోయి, భర్తను కట్టివేసి భార్యను అతని కళ్ళముందే సామూహికంగా అత్యాచారం చేసారు.

గిరిజనులు అడవిని నమ్ముకుని బతుకుతున్నవారే కానీ వారు ఆటవికులు కారు. వారూ మన సమాజంలోని వారే. వారికి చట్టాలు వర్తిస్తాయి. ఓటు హక్కుంది. తాజాగా సభాపతి ఆధ్వర్యంలో గిరిజనుల కష్టసుఖాలను అడిగితెలుసుకుని శాసన సభ్యులు కొన్ని బాసలు కూడా చేసి వచ్చారు. కానీ నాయకులకు వారి రాజకీయాలతోనే సమయమంతా గడిచిపోతోందని, గిరిజనుల వ్యథలను పట్టించుకునే నాథుడే లేడంటూ గిరిజిన సంఘాలు ఆరోపిస్తూ, ఈ ఘటన మీద, లోగడ సంవత్సరాలుగా న్యాయం జరగని మరెన్నో ఘటనలమీద (సరిహద్దు భద్రతా జవాన్లు గిరిజన మహిళమీద సామూహిక మానభంగాలు) ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నారు.

నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు యధావిధిగా మిగిలిన అటువంటి కేసుల జాబితాలోకి పోతుందని, తమకి రక్షణే లేదా అంటూ గిరిజనులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iran film gets oscar for the first time
New angle in 2g spectrum case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles