2జి స్పెక్ట్రమ్ కేసు లో మరో కొత్త మలుపు వెలుగుచూసింది. 122 లైసన్స్ ల జారీకి 20 రోజులు ముందు, జనవరి 30, 2008 న అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం, టెలికాం మంత్రి ఎ.రాజాలు సమావేశమై, స్పెక్ట్రమ్ నియామకం తర్వాత ఆ కంపెనీలు వాటిని సొమ్ము చేసుకోవటానికి ఇతర సంస్థలతో కలవటం జరుగవచ్చని, ఈ సందర్భంగా విలీననాలు, సంస్థల అమ్మకాలు కొనుగోళ్ళు కూడా జరగవచ్చని ఊహించినట్టుగా తెలిసింది. ఇందులో అవినీతిని అరికట్టటానికి, స్పెక్ట్రమ్ విలువ పెరిగిన సందర్భంలో భారత ప్రభుత్వానికి అందులో వాటా వచ్చే విధంగా నియమాలను రూపొందించాలని కూడా తీర్మానించుకున్నారు. ఆ సమావేశంలో ఆర్థిక శాఖ, టెలికం శాఖలకు చెందిన సెక్రటరీలు కూడా హాజరయ్యారు.
ఈ రెండు శాఖలకూ మధ్య జరిగిన చర్చలు 4 పేజీలలో వచ్చినట్టుగానూ, దాన్ని మార్చ్ 5, 2011 న సిబిఐకి అందజేసినట్టుగాను ఆర్థిక శాఖ కార్యదర్శి డా.సుబ్బారావు తెలియజేసారు. ఆ చర్చల్లో ఈ కిందివిషయాలు చోటుచేసుకున్నాయి.
స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థలలో కొన్ని కేవలం స్పెక్యులేషన్ ఉద్దేశ్యంతోనే వచ్చే అవకాశముంది. అందువలన అనుమతులు పొందిన తర్వాత కొన్ని సంస్థలు విలీనమవటం కానీ, అమ్మకాలు కొనుగోళ్ళు కానీ జరగవచ్చు. ఆసమయంలో అటువంటి సంస్థాగతమైన మార్పులలో స్పెక్ట్రమ్ అనుమతి దక్కించుకున్న సంస్థల ఆర్థిక విలువలు పెరగవచ్చు. స్పెక్ట్రమ్ తో వ్యాపారం చెయ్యటమనేది ఉపేక్షించదగ్గది కాదు. దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా జరిగిన సందర్భాల్లో పెరిగిన విలువలలో ప్రభుత్వానికి వాటా రావలసివుంటుంది......
2జి స్పెక్ట్రమ్ లభించిన స్వాన్, యూనిటెక్ సంస్థలకు ఎటిసలాట్, టెలినార్ సంస్థలు భారీగా ప్రీమియం చెల్లించి చేజిక్కించుకున్నాయని దర్యాప్తు సంస్థ సిబిఐ అభియోగం. అయితే, చిదంబరం వాటిమీద స్పందిస్తూ ఇవి మెర్జర్ (విలీనం) కానీ, అక్విజిషన్ (కొనుగోలు) లోకి కానీ రావని, కేవలం భారతీయ సంస్థ తన షేర్లను విదేశీ సంస్థలకు ప్రీమియంకి జారీ చేసిందని అన్నారు. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆయా సంస్థలకు ఎటువంటి అనుమతులూ అవసరం ఉండదని కూడా చిదంబరం అన్నారు. స్పెక్ట్రమ్ అనుమతి లభించటంతో ఆ వ్యాపారం చేసి కాకుండా, రాత్రికిరాత్రే ధనాన్ని పొగుజేసుకున్న పై రెండు సంస్థల వ్యవహారం మీద అదంతా మామూలే రోటీన్ విషయమే అన్నట్టుగా హోంమంత్రి చిదంబరం మాట్లాడటం రాజకీయరంగంలో ముక్కుమీద వేలేసుకునేట్టుగా చేస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more