Cm chandrababu war of words

AP Assembly | CM-Chandrababu War Of Words | ap assembly| chandrababu kiran war of words| ap assembly | ap assembly session cm bchandrababu war chandrababu kiran kumar war | ap assembly videos| ap ssembly videos| ap assembly question hour

AP Assembly | CM-Chandrababu War Of Words | ap assembly| chandrababu kiran war of words| ap assembly | ap assembly session cm bchandrababu war chandrababu kiran kumar war | ap assembly videos| ap ssembly videos| ap assembly question hour

CM-Chandrababu War Of Words.GIF

Posted: 02/25/2012 10:26 AM IST
Cm chandrababu war of words

cm-kiran_chandrababuమళ్ళీ అదే రగడ.....అదే రభస... ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతూ (పత్రికలకు)రోడ్డుకెక్కుతున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు వరుసగా రెండో రోజు తిట్ల పురాణం చదువుకున్నారు. సీపీఐ నారాయణ అన్నట్లు గా అది అసెంబ్లీ కాదు... పందుల దొడ్డే అని నిరూపించారు మన నేతలు. శుక్రవారం మద్యం మామూళ్ళ వ్యవహారంపై జరిగిన చర్చ.. పరస్పరారోపణల కిక్కులో మామూలుగానే పక్కకుపోయింది! దాని స్థానంలో పాత చరిత్రలు మళ్లీ వెలికివచ్చాయి! ఇంకాస్త ముందుకు వెళ్లి కుటుంబ సభ్యుల వ్యవహారాలను, వ్యక్తిగత దూషణ భాషణలు ‘ఫుల్లు’గా సాగాయి! మద్యం పై చర్చ కాబట్టి పెగ్గు పెగ్గుకు నిషా పెరిగినట్లు రౌండు రౌండుకూ వాగ్యుద్ధాలు, ఆరోపణాస్త్రాలు రిపీట్ అయ్యాయి! ఇంకా కిక్కెక్కువై. సిగ్గు.. శరం. లజ్జ వంటి పదాలు పొంగిపొర్లాయి! మద్యం విషయంలో ఎవరి అర్హతలేంటో ఎదుటి పక్షాల నేతలు తేల్చేశారు! ఒకరి బాగోతాలు మరొకరు బయటపెట్టుకున్నారు! పేకాట ప్రస్తావనలు వచ్చాయి! చివరికి.. మద్యం సిండికేట్ల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ. రచ్చరచ్చయి ఆద్యంతం కిక్కెక్కించింది.

ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అసెంబ్లీలో గనుక దుమ్ము ఉంటే ఖచ్చితంగా మీద కూడా చల్లుకునేవారేమో. చివరగా మద్యం రణ రంగానికి కారణమైన మోపిదేవికి మాత్రం కిరణ్ క్లీన్ చిట్ ఇచ్చేసాడు. కానీ దీనిని వదిలేదు లేదని చంద్రబాబు చెప్పాడు. సోమవారం కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతామని చెప్పాడు. రాత్రి 9.30 వరకు జరిగిన రసాభాసలో ప్రజలకు వచ్చిందేమీ లేదు. ప్రజాధనం నీళ్ళపాలయ్యింది తప్పితే. మరి ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narayana re elected as cpi andhra pradesh secretary
Vri vra exam key released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles