Chief minister n kiran kumar reddy

Chief Minister N Kiran Kumar Reddy,Chief Minister of Andhra Pradesh, Kiran Kumar Reddy, Telagana, Employees, Demand, JAC , swam, vital srinivash,

Chief Minister N Kiran Kumar Reddy

Kiran.gif

Posted: 02/23/2012 10:40 AM IST
Chief minister n kiran kumar reddy

సమ్మె విరమణ సమయంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయా లని తెలంగాణ ఉద్యోగుల జెఎసి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. హామీ లను నెరవేర్చక పోగా, ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ జెఎసి నాయకత్వంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనకు దిగారు. జెఎసి పిలుపు మేరకు జంట నగరాలలోని పలు కార్యాలయాలు, తెలంగాణలోని కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడీలు ధరించి నిరసనకు దిగారు. నగరంలోని బీమా భవన్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జెఎసి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, నాయకులు విఠల్‌, శ్రీనివాస్‌ గౌడ్‌లు పాల్గొన్నారు.

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యో గుల పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా పరిగణిస్తామనే హామీని నెరవేర్చకుండా, ఉద్యోగుల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నాలు చేస్తు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమ్మె లో చురుకైన పాత్ర పోషించిన ఉద్యోగులను అక్రమంగా బదిలీలు చేస్తూ, ప్రాధాన్యత లేని విభాగాలకు మార్చుతూ, ఎసిబి దాడులకు కూడా దిగుతామనే హెచ్చరికలు చేస్తున్నార న్నారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్షకు పాల్పడితే, వేధింపులకు దిగితే, ఎసిబితో దాడులు చేయిస్తే మరోసారి సమ్మె బాట పట్టక తప్పదని స్వామిగౌడ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు జీతాలు ముఖ్యం కాదని, ప్రత్యేక రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. తమ ఆందోళనల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి వర్క్‌ టు రూల్‌ కార్యక్రమాన్ని చేపడతామని, ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందని, చివరగా హైదరాబాద్‌లో భారీ ధర్నా చేపడతామని తెలిపారు.

తమ ఆందోళనలతో ప్రభుత్వం దిగి రాకుంటే సమ్మె చేయక తప్పదని చెప్పారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈసారి సమ్మెకు దిగితే అత్యవసర సేవలను కూడా నిలిపేసేందుకు వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. సమైక్యత గురించి మాట్లాడే వారు తెలంగాణ ఉద్యోగులపై వివక్ష ప్రదర్శించడమేమిటని ఆయన ప్రశ్నించారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుంటే మరోసారి సమ్మెకు దిగి పరిపాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని విఠల్‌ స్పష్టం చేశారు. హామీలను నెరవేర్చాలని కోరుతూ పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులను కోరినా, వారి నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడం విచారకరమ న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu vs dharmana serious dialogue
Trs mlas suspended for unruly behaviour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles