The andhra pradesh budget manual

THE ANDHRA PRADESH BUDGET MANUAL,Budget speeches, scams, wiki-leaks,leakage of budget data.

THE ANDHRA PRADESH BUDGET MANUAL

BUDGET.gif

Posted: 02/17/2012 09:34 AM IST
The andhra pradesh budget manual

THE ANDHRA PRADESH BUDGET MANUALహ్యాకింగ్‌ కారణంగా బడ్జెట్‌ పేపర్లు లీకు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటికే పేపర్లన్నీ తన దగ్గర ఉన్నాయని టిడిపి ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ప్రకటించారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌ పేపర్లు ఎక్కడబడితేఅక్కడ దొరుకుతు న్నాయన్నారు. బడ్జెట్‌ మొత్తం తన దగ్గర ఉందని చెప్పిన ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సాగునీటు ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపుల పేపర్లను చూపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.700 కోట్లు కేటాయించారని తెలిపారు. మొత్తం నీటి పారుదల శాఖకు 15 వేల కోట్ల 10 లక్షల రూపాయాలు కేటాయించారని చెప్పారు. బడ్జెట్‌ లీకు అయినందున ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారో, ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారో తేల్చుకోవాలన్నారు. కాగా దయాకర్‌రెడ్డి వాదనను ఆర్థిక శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రభుత్వ శాఖలు తమకు అందించిన ప్రతిపాదన కాగితాలనే ఎమ్మెల్యే చూపుతున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior doctors call off strike
India takes italian navy firing on fishermen seriously  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles