Ramachandraiah questioned the land allotments made by chandrababu naidu

Ramachandraiah questioned the land allotments made by Chandrababu Naidu,Endowments Minister C Ramachandraiah offers to quit politics if it is proved Chiranjeevi has any links with Bhavani Islands,

Ramachandraiah questioned the land allotments made by Chandrababu Naidu

Ramachandraiah.gif

Posted: 02/15/2012 10:54 AM IST
Ramachandraiah questioned the land allotments made by chandrababu naidu

Ramachandraiah questioned the land allotments made by Chandrababu Naidu

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంవూదయ్య విరుచుకపడ్డారు. భవానీ ద్వీపంపై ఆయన అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ ద్వీపానికి సంబంధించి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేకున్నా.. కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు చేసేందుకు హద్దూ.. పద్దూ లేదా..? అని ప్రశ్నించారు. ఆరోపణలు ఆపకుంటే.. బాబు ‘మటాష్’ అవుతారని హెచ్చరించారు. భవానీ ద్వీపం విషయంలో విజయవాడ కనకదుర్గ లేదా కాణిపాకం దేవాలయంలో చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ప్రభుత్వపరంగా చిరంజీవి ఎక్కడైనా లబ్ధిపొందారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇతరులపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పాశవిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. భవానీ ధ్వీపం కారణంగా కృష్ణ జలాలు కలుషితం అవుతాయంటున్న టీడీపీ నేతలు.. ఆ టెండర్లలో ఎలా పాల్గొన్నారని ప్రశ్నించారు. అసలు ప్రైవేటీకరణ చేయడం చంద్రబాబే ప్రారంభించారని తెలిపారు. ‘ఆయన చేస్తేనే సంసారమా? ఇతరులు చేస్తే?’ అంటూ ప్రశ్నించారు. సినీ దర్శక, నిర్మాతలైన రాఘవేంవూద రావు, రామానాయుడుకు చౌకగా భూములియ్యలేదా..? అని ప్రశ్నించారు. స్టూడియో కోసం తీసుకున్న స్థలంలో రాఘవేందర్‌రావు థియేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించలేదా..? అన్ని ప్రశ్నించారు. అదే విధంగా విజయవాడలోని కృష్ణవేణి హోటల్‌ను ప్రైవేట్ పరం చేయలేదా..? అంటూ నిలదీశారు. హుస్సేన్‌సాగర్ శిఖం భూముల్లో దళితుల కోసం ఎన్టీఆర్ కేటాయించిన స్థలాన్ని, చంద్రబాబు ‘ఐమాక్స్’ థియేటర్‌కు కేటాయించారని తెలిపారు.
కమ్యూనిజం పోయిందన్న బాబుతో ‘సంసారం’ ఎలా..!
కమ్యూనిజం పోయిందన్న చంద్రబాబుతో సీపీఎం నేత రాఘవులు ఏ విధంగా ‘సంసారం’ చేస్తున్నారని రామచంవూదయ్య ప్రశ్నించారు. చంద్రబాబు అవమానిస్తున్నా.. రాఘవులు వెంటపడుతున్నారని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Idians living in foreign lands resorting to violence
Confusion rents air in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles