అది ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పవిత్ర దేవాలయం. ప్రజల నేత ఎన్నుకోబడి ప్రజల సొమ్మును నీళ్ళ పాలు చేస్తూ రాజభోగాలు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు అసెంబ్లీ సాక్షిగా నీలి చిత్రాలు చూశారు. కర్నాటక అసెంబ్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యల పై చర్చలు జరుగుతుండగా ఇద్దరు మంత్రులు తీరిగ్గా అశ్లీల చిత్రాలను చూస్తూ మీడియా కంటికి దొరికి పోయారు. కర్ణాటక సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది సెల్ఫోన్లో నీలిచిత్రాన్ని చూస్తూ తన ప్రక్కనే ఉన్న సీసీ పాటిల్ కి కూడా ఈ పోర్న్ మూవీ చూపిస్తూ సొల్లు కార్చారు. అదే సభలో మరో మంత్రి ఓడరేవుల శాఖ జె.కృష్ణ పాలేమార్కు చెందిన ఆ ఫోన్లో నీలిచిత్రం చూస్తూ వీరిద్దరూ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాల కళ్లలో పడటం గమనార్హం.
అయితే ఈ వ్యవహారం అంతా మీడియాలో ప్రసారం కావడంతో ఆ మంత్రులిద్దరినీ తక్షణం డిస్మిస్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.ఈ వ్యవహారంపై బిజెపి అధిష్ఠానం భగ్గుమంది. ముగ్గురు మంత్రులనూ రాజీనామా కోరాలని ముఖ్యమంత్రి సదానంద గౌడను పార్టీ అధ్యక్షుడు గడ్కరీ ఆదేశించారు. కాగా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు బుధవారం ఉదయం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే అక్రమ మైనింగ్, లోకాయుక్త తదితర సమస్యల్లో ఇరుక్కున్న బిజెపికి ఇది మరో దెబ్బ.
ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేస్తే సరిపోతుందా ? సభ్యసమాజం తలదించుకునేలా సాక్షాత్తు మంత్రులు ఇలా అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన వీరి ఏం చేయాలి ? సమాజం నుండి వెలివేయాలా ? లేక దేశ బహిష్కరణ చేయాలా ? ఏం చేసినా పాపం లేదు అని ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more