Response of political leaders about excise bribe

response, of political leaders ,about, excise bribe,

response of political leaders about excise bribe

5.gif

Posted: 02/08/2012 12:30 PM IST
Response of political leaders about excise bribe

nunna_ramana ఖమ్మం జిల్లా మద్యం వ్యాపారి నున్నా వెంకటరమణ చేసిన ఆరోపణలపై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పొలిటికల్ నేతలు ఒక్కొక్కరిగా తమ వాదనలు వినిపిస్తున్నారు. తమకేపాపం తెలీదంటూ కొందరు సెలవిస్తుంటే, అవునా..అది లంచమా.. అంటూ చాలా ఆశ్చ్యర్యాన్ని ప్రదర్శిస్తుండటం కొందరి వంతైంది.

kavitaరమణ ఎవరో తనకు తెలియదని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవిత తెలిపారు. మద్యం సిండికేటు నుంచి తాను డబ్బు తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాజకీయంగా ఓర్వలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

రమణ ఎవరో తనకు తెలియదని, తనపై వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరావు అంటున్నారు. పార్టీ కోసమే తప్ప వ్యక్తిగతంగా ఎవరి నుంచి డబ్బు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

puvvadaపార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల కోసం అన్ని పార్టీల మాదిరిగానే తాము చందాలు తీసుకున్నామని సీపీఎం ఖమ్మం జిల్లా శాఖ ప్రకటించింది. పార్టీ మహాసభల కోసం చందాలు తీసుకుని, రశీదులు ఇచ్చామని కమిటీ తెలిపింది. ఉద్యమ పార్టీలను అప్రతిష్ట పాలు చేయడానికి మద్యం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆరోపించింది. మద్యం వ్యాపారులు ఇచ్చిన డబ్బు వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని ఆ పార్టీ ప్రకటించింది.cpiml_new_democracy

రాష్ట్రమంతా మద్యం ముడుపుల వ్యవహారం హాట్..హాట్ గా మారిన తరుణంలో ఎక్సయిజ్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణను పదవి నుంచి తొలగించాలని, ఏసీబీ దాడుల్లో పట్టుబడిన వారి అందరి పేర్లు బహిర్గతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన విశాఖపట్టణంలో యువతరంగం కార్యక్రమాన్ని కొద్దిసేపటిక్రితం ప్రారంభించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Porn in assembly3 bjp ministers resign in karnataka
Excise minister mopidevi venkata ramana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles