రాష్ట్రంలోని హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వివరాలను మూడు నెలల గడువులో ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఈ విషయంలో, రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలుస్తామని పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ చెప్పారు.
వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఉపయోగించాలన్న ప్రతిపాదన 1989 నుంచే ఉంది. దీనిమీద ఎటువంటి చర్యలూ చేపట్టనందుకు పోయిన సంవత్సరం సెప్టెంబరు నెలలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఘాటుగా విమర్శించింది. తాజాగా మార్చి 31 వరకూ గడువిస్తూ, ఏప్రిల్ 1 నుంచి బయటకు వచ్చే వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను పెట్టాలని ఆదేశించటంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ టెండర్లకు పిలుస్తున్నాయి.
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లల్లో ప్రత్యేకతలు- 1. రెజిస్ట్రేషన్ నంబరు వాహనం ముందు వెనకాలే కాకుండా విండ్ షీల్డ్ మీద కూడా ఉంటుంది. 2. 1 ఎమ్ఎమ్ మందంతో చేసిన అల్యూమినియమ్ ప్లేట్లు నాలుగు మూలలూ రౌండ్ గా ఉంటాయి. 3. నీలం రంగులో చక్రం హోలోగ్రామ్ ఉంటుంది. 4. నీలం రంగులో భారత్ ను సూచిస్తూ, అని రాసివుంటుంది. 5. ప్రతి వాహనానికీ ప్రత్యేకమైన లేజర్ కోడ్ కలిగివున్న విండ్ షీల్డ్ స్టికర్ మార్చటానికి వీల్లేకుండా ఉంటుంది. దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే అది చెడిపోతుంది, మరో స్టికర్ ని అక్కడ అమర్చటానికి వీలులేకుండా ప్లేట్ మీద స్నాప్ లాక్ ఉంటుంది. 6. నంబర్ ప్లేట్ ని ఆర్ టి వో కార్యాలయంలోనే అమర్చబడతాయి. 7. ఈ కొత్త ప్లేట్లకుండే ప్రత్యేకమైన నంబరునిబట్టి దేశంలో ఎక్కడున్నా కనిపెట్టటానికి వీలవుతుంది. 8. ఫాన్సీగా ఉండే రకరకాల నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నవారి ఆటలు ఇక కట్టు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more