వ్యాపారస్తులు తమ ఉత్పాదనను ప్రజల్లోకి తీసుకుని వస్తూ, నాలుగుసార్లు వారికంటబడేట్టుగా ప్రకటనలు చేస్తూపోతే అది కొన్నాళ్ళకి పాతబడి వినియోగదారుల ఎంపికలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎప్పుడూ వినని ఉత్పాదనలను ఎవరూ తీసుకోరు. అయితే వారు దాన్ని ప్రకటనగా కాకుండా ప్రజల్లో అవగాహన పెంచటానికే (కన్సూమర్ ఎడ్యుకేషన్) అలా చెయ్యవలసి వస్తుందని అంటారు కానీ తమ అమ్మకాలను పెంచుకోవటం కోసం అని అనరు. అమ్మకాల మాట కూడా ఎత్తుతారు కానీ అది కూడా ప్రచారంలో భాగమే. అత్యధికంగా అమ్ముడుపోతున్న, అందరూ కోరుకుంటున్న అన్న మాటలతో ప్రచారం చేస్తారు. నిజంగా అందరూ కోరుకుంటూ అత్యధికంగా అమ్ముడుపోతుంటే మరి దానికి ప్రచారం అవసరమా.
వ్యాపార ప్రకటనల్లాంటివే పార్టీ ప్రచారాలు కూడా. రాజకీయ పార్టీలు కూడా జనంలో చైతన్యం తేవటం కోసం పాదయాత్రలు, పోరుబాటలు నిర్వహిస్తూ, 2014 ఎన్నికలు లక్ష్యంగా, ఈ లోపులో వచ్చే ఉప ఎన్నికలు ఉపలక్ష్యంగా చురుగ్గా జనంలోకి పోతున్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భాజపా తెలంగాణా ఉద్యమం పేరుతో రాష్ట్రంలో పోరు బాట సాగిస్తోంది. అందులో, యాత్ర చేస్తున్నప్రదేశాన్ని బట్టి స్థానిక సమస్యలను కూడా తెరమీదకు తెస్తూ తమకే గనక పాలన చేతిలోకి వస్తే ఏం చేస్తారన్న సంగతి విశదీకరిస్తూ పోతున్నారు. కిషన్ రెడ్డి సారధ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పోరుబాట పట్టిన కార్యక్రమం భద్రాచలం తో ముగియనుంది. అయితే చేస్తున్నది తెలంగాణా పోరాటం, ఇతర రైతు సమస్యల్లాంటివే అయినా, మత పరమైన సిద్ధాంతంతో నడిచే భాజపా తో కలవటానికి కమ్యూనిస్ట్, న్యూడెమాక్రసీ పార్టీలు సంకోచిస్తున్నాయి.
9 ఉదయం భద్రాచలంలో ముగియనున్న కిషన్ రెడ్డి పోరుయాత్ర ఈ లోపులో కీలకమైన ప్రాంతాలను రోడ్ షోలు తదితర కార్యక్రమంలో చుట్టబెడుతుంది. భద్రాచలంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగసభలో భాజపా తన సిద్ధాంతాలను ఏకరవుపెడుతుంది. శ్రీరామ క్షేత్రంగా భద్రాచలంలో అయోధ్య రామాలయ ఏర్పాటుతో పాటు గిరిజన సమస్యలు, తెలంగాణా వాదం మరెన్నో విషయాలతో భాజపా ప్రజల ముందుకు రానుంది. అన్ని పార్టీలకూ 2014 పెద్ద పరీక్షల మీదనే దృష్టి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో మార్కులు పడని ప్రాక్టికల్స్, థీరీ క్లాసెస్ లను పక్కకు పెట్టి పెద్దపరీక్షలే ధ్యేయమన్నట్టు సిద్ధమవుతున్నట్టుగా ముందుకెళ్తున్నాయి పార్టీలన్నీ. ఈ లోపులో ప్రజా సంక్షేమమా, ప్రజలు ఎవరికివారే చూసుకుంటారు. చైతన్య రథాలైన కార్లలో దూసుకుపోవటమే. దారిలో మనుషులు తమ భద్రతా దృష్టిలో తమంతట తామే తప్పుకుంటారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more