Rahul gandhi takes on mayawati

Rahul Gandhi takes on Mayawati,Congress General Secretary Rahul Gandhi ,Rahul Gandhi accuses Mayawati of fooling people, Mayawati, Rahul Gandhi,Mayawati launches BSP campaign in UP

Rahul Gandhi takes on Mayawati

Rahul.gif

Posted: 02/06/2012 10:59 AM IST
Rahul gandhi takes on mayawati

Rahul Gandhi takes on Mayawatiమాయావతి హయాంలో అవినీతిమయమైన ఉత్తర ప్రదేశ్ అన్ని విధాలా బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతో ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఐదేళ్ల మాయావతి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిందని అన్నారు. 22 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి అధికారాన్ని ఇవ్వాలని.. అది కచ్చితంగా రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకూ వెనుకబడి ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ప్రగతిపథంలో పరుగు పెట్టించడానికి తమ పార్టీ శతవిధాలా కృషి చేస్తుందని ఆదివారం పలు ఎన్నికల సభల్లో మాట్లాడిన సందర్భంగా రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రాన్ని బాగు చేసి రాష్ట్ర ప్రజల పట్ల తన బాధ్యతను నెరవేర్చుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి ఎంతో ఉందని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల కోసం నిధులను మంజూరు చేసిందని చెప్పిన రాహుల్ ‘ఆ నిధులను లక్నోలో కూర్చున్న ఏనుగు (బిఎస్‌పి ఎన్నికల గుర్తు) మింగేసింది’ అని వ్యాఖ్యానించారు. ప్రజల స్థితిగతుల్ని స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తాను రాష్ట్రంలోని అనేక గ్రామాలకు వెళుతున్నానని, అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నానని రాహుల్ గుర్తు చేశారు. తాము ప్రజల మనుషులమని, వారి సంక్షేమనే తమ లక్ష్యమని చెప్పుకునే ఎంతమంది నాయకులు వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నారని రాహుల్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plants speaking together
Britan rani hand bag checking  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles