Britan rani hand bag checking

britan rani hand bag checking, Money, 10 founds, 85 years, reading books, what is in the queen Hand bag, smith

britan rani hand bag checking

britan.gif

Posted: 02/06/2012 10:52 AM IST
Britan rani hand bag checking

britan_raniరాజరికపు వ్యవస్థలో రహస్యాలు బయటకు పొక్కడం చాలా కష్టం. ముఖ్యంగా బ్రిటన్ రాణి హ్యాండ్‌బ్యాగ్‌లో నగదు తీసుకుని వెళ్తుందా లేదా అన్న ఊహాగానాలకు తెరదించుతూ విడుదలైన ఒక పుస్తకంలో ఆమె తన బ్యాగ్‌లో అయిదు లేదా 10 పౌండ్ల నోట్లను కూడా ఉంచుకుంటుందని పేర్కొన్నారు. రాణి జీవిత చరిత్రను రాసిన శాలీ బీడెల్ స్మిత్ సీక్రెట్స్ ఇన్‌సైడ్ హెర్ మేజెస్టీస్ బ్యాగ్ గురించి ‘ఎలిజిబెత్ ది క్వీన్:ది ఉమెన్ బిహైండ్ ది థ్రోన్’లో ఎన్నో విషయాలు వెల్లడించినట్లు రచయిత ‘ది లేడీ మ్యాగ్‌జైన్’కు తెలిపారు.
85 సంవత్సరాల బ్రిటన్ రాణి తన బ్యాగ్‌లో రీడింగ్ గ్లాసెస్, ఒక ఫౌంటేన్ పెన్‌తో పాటు ఆదివారాలు చర్చికి దానం చేసేందుకు మడతపెట్టిన అయిదు లేదా 10 పౌండ్ల నోట్లు తీసుకుని వెళ్లేవారని, ఇంకా తన బ్యాగ్‌ను టేబుల్‌కు వేలాడదీసేందుకు వీలుగా హుక్‌ను కూడా తీసుకుని వెళ్లేవారని తెలిపారు. ఇదే విషయాన్ని రాణి కజిన్ జీన్ విల్లీస్‌ను ఉటంకిస్తూ ‘డెయిలీ మెయిల్’ ప్రచురించింది.
2007లో కూడా ‘వాటీజ్ ఇన్ ది క్వీన్స్ హ్యాండ్ బ్యాగ్: అండ్ అదర్ రాయల్ సీక్రెట్స్’ అన్న పుస్తకంలో కూడా ఎన్నో విషయాలను రచయిత స్మిత్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi takes on mayawati
Ap congress denies ias officers being made scapegoats  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles