తమ వద్దనున్న సాక్ష్యాధారాలా ప్రకారం, 2జి కుంభకోణంలో హోంమంత్రి చిదంబరం పాత్ర ఉన్న రుజువులేమీ లేవని సిబిఐ స్పష్టం చేసింది. కోర్టుల్లో సామాన్యంగా వాటి ముందుకొచ్చిన అభియోగాలను పిటిషన్ లలో పేర్కొన్నంతవరకే చూస్తాయి. 2జ అనుమతుల్లో చిదంబరం సంతకం ఎక్కడా లేదు. రాజా సంతకమే ఉంది. రాజాకి అటువంటి ఆదేశాలిచ్చిన దాఖలాలూ ఎక్కడా లేవు. కనుక చిదంబరం పాత్ర అందులో ఉందన్న జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి అభియోగం వీగిపోయింది. అయిందేదో అయిపోయింది గతం గతం అని చిదంబరం ప్రధాన మంత్రికి రాసిన లేఖ వలన ఆయన పాత్ర ఉందన్నది నిరూపణ కాలేదు. సుబ్రమణ్యం వేసిన పిటిషన్ లోనే లోపముంది కాబట్టే అది వీగిపోయింది. అందుకే సిబిఐ చెప్పేది, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పిచ్చిందీ ఒకటే అయింది.
అస్తవ్యస్తమైన విధానంలో అస్మదీయులకు అనుమతులిచ్చిన రాజా తంతంతా ఎప్పుడో వెల్లడైంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని సరిచేసుకునే ప్రయత్నం ఏం చేపట్టిందన్నది ప్రశ్న. ఏమీ చెయ్యలేదు కాబట్టి ప్రధాన మంత్రి, హోంమంత్రి (అప్పటి ఆర్థిక శాఖా మంత్రి) కి అందులో భాగముందన్నది సమ్మతించదగ్గ సాక్ష్యం కాదు. చేతకాని తనం, లేదా అలసత్వం, మెతకదనం, చేసిన పాపానికి సాక్ష్యమవదు. మొన్న సుప్రీం కోర్టు చేసినట్టుగా తక్షణ చర్యలు తీసుకోగల అధికారం ప్రభుత్వానికుంది.
రాజా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చినంత మాత్రాన వాటిని ఉపసంహరించుకోగూడదనేమీ లేదు. ఇదేదో తెలుగు సినిమాలో పసుపుతాడు సెంటిమెంటులా ఉంది. విలన్ బలవంతంగా తాళికడుతుంటే హీరోయిన్ తప్పించుకోవటం, లేదా ఆఖరు క్షణంలో హీరో వచ్చి రక్షించటంతో ప్రేక్షకులంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఒకవేళ ఆ పని చెయ్యలేకపోతే తాళి పడ్డందుకుగాను నా ఖర్మింతే నని హీరోయిన్ ఆ విలన్ తో సంసారం చెయ్యటం జరుగుతుంది. అలాగే ఉంది ఈ రాజా లెటర్ ఆప్ ఇంటెంట్ సెంటిమెంటు. సుప్రీం కోర్టు చూపించిన చొరవ ప్రజాప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం ఎందుకు చెయ్యలేదన్నది ప్రశ్న. దానికి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పవలసిందే. దీన్ని వైఫల్యంగానైనా తీసుకోవాలి, లేదా అపరాధంగానైనా లెక్కించాలి కానీ రెండిటి నుంచీ తప్పించుకోవటం కష్టం- సరైన విధంగా పిటిషన్ ని ఫ్రేం చేస్తే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more