మన భారత భాగవతాలు, పురాణాల్లో నిక్షిప్తమైయున్న ఙానం అనంతమైనది. అందులోని ఙానాన్ని ఎవరికి వారు వారి వారి స్థాయిలను బట్టి పొందవలసిందే. వాటిని ఎన్ని రకాలుగానైనా వివరించవచ్చు. భారతంలోని ఈ ముఖ్య పాత్రలను గమనించండి-
(మహాభారత కథ పాఠకులకు తెలుసన్న ఉద్దేశ్యంతో ఇచ్చిందే ఈ కింది వివరణ)
స్వయంవరంలో సంపాదించుకున్న ద్రౌపదిని వెనక దాచి, "మాతా నాకో తాయిలం దొరికింది" అన్నాడు అర్జునుడు.
"ఐదుగురు అన్నదమ్ములూ పంచుకోండి నాయనా" అంది కుంతి, తల్లికి అందరు పిల్లల మీదా సమానంగా కలిగివుండే ప్రేమతో.
తల్లి మాటను జవదాటని పంచపాండవులు పాంచాల రాచకన్య పాంచాలిని పంచాలిని (ఐదుగురికి భార్యను) చేసారు. పెద్దల మాటలకు గౌరవమిచ్చే సంస్కారవతి ద్రౌపది స్వయంవరంలో తనకు లభించిన ఐదు గురు మహావీరులైన పంచపాండవులను తన భాగ్యంగా భావించి గర్వపడింది. ఇక వారితోనే తన జీవితం అని నిర్ణయించుకుంది.
పంచభూతాల మేలుకలయికైన శరీరం, అందులో పంచేంద్రియాలు లభించాయి చిత్తానికి. వాటి జనని ఆదిశక్తికి ప్రణమిల్లి, తన కొత్తరూపాన్ని వాటిలో చూసుకుంది. దొరికిన శక్తులకు గర్వపడింది.
"నేను, నాశరీరం. ఈ శరీరంతోనే నా జీవితం. నేను శక్తివంతురాలను" అనే అహంకారం చిత్తంలో ఆవిర్భవించింది.
ఆతర్వాత జీవన చక్రంలో ఎన్నో సంఘటనల తర్వాత మాయా జూదం లో ఓడిపోయిన పంచపాండవుల ఎదురుగానే పాంచాలిని కౌరవులు అవమానపరచారు. వారిపై కుపితులయ్యారు పాండవులు కానీ సహనం వహించారు. పరిస్థితులకు తలవొగ్గి, తమ చేతకాని తనానికి చింతించారు. కానీ అలా వగచి వదిలెయ్యనివ్వలేదా పాంచాలి. శిరోజాలనెగురవేస్తూ, ప్రతీకారాగ్నిని ఎగదోస్తూ, అనుక్షణం జరిగినదాన్ని వారికి గుర్తు చేస్తూ, చివరకు తన పంతం నెగ్గించుకుంది. కానీ చివరకు ఏం జరిగింది?
మనసుకి ఏర్పడ్డ అహంకారం మీద దెబ్బ తగిలింది. సృష్టిలో ఇంకా ఉన్నాయి చిత్తాలు, వాటికి శరీరాలు. ప్రకృతిని వారందరితోనూ పంచుకోవలసి వస్తోంది. దానితో పాటు చిత్త వికారాలు మొదలయ్యాయి. తనకున్న పంచేంద్రియాలనుపయోగించి సంపదను పెంచుకోవాలి- అందరితో పంచుకోవటం కాదు. తనది, తన సంపద, తన హక్కు భుక్తం, తనకీ ప్రపంచానికీ స్పష్టంగా తెలియాలి.
దానితో మొదలైంది అంతర్యుద్ధం. పంచేంద్రియాలు కూడా స్పందించాయి. కానీ తన పరిమితులనెరిగిన శరీరం సహనం వహించింది. అయితే మనసు సహనం వీడింది. దెబ్బ తగిలింది తన అహంకారం మీద కదా. వేచి చూసి వేసింది వేటు తన ప్రత్యర్థుల మీద. కానీ చివరకు ఏం జరిగింది?
పంచేంద్రియాలు, చిత్తానికి ఆత్మ కూడా సహకరించింది. తానే సారధ్యం వహిస్తూ ప్రతీకారం తీర్చుకోమంది.
"మీ పట్టు విడవొద్దు. చెయ్యాల్సింది మరవొద్దు. ప్రతిఫలం గురించి ఆలోచించవద్దు. మీ చర్యల వలన ఒనగూడే లాభ నష్టాలను నాకు వదిలెయ్యండి" అని పంచేంద్రియాల శరీరానికి ఉపదేశించింది. అంతేకాదు, "అన్నీ నేనే. మీరంతా నిమిత్తమాత్రులు. మీరు చేసేది మంచైనా చెడైనా దాని అంత్యఫలం చెందేది నాకే" అని వక్కాణించింది ఆత్మ.
అయితే, ఆత్మ మాటలను నమ్మలేదు చిత్తం, దాని అంగాలు. భ్రూ మధ్యంలో దివ్య చక్షువు ఏర్పడిన తర్వాతనే ఆత్మఙానమైంది!
"కాబట్టి పార్థా, నీధర్మాన్ని నీవు నిర్వర్తించు. ఫలితాన్ని నాకు వదిలిపెట్టు" అని ముగించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణడి నిజస్వరూపాన్ని చూడగోరగా పాండవమధ్యముడికి విరాట స్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు. దాన్ని చూసి సూక్ష్మాన్ని తెలుసుకున్నాడతను!
యుద్ధం జరిగింది. మహా యుద్ధం. భయంకరమైన కురుక్షేత్ర యుద్దం. అప్పుడు ఏం జరిగింది?
వీరమరణం పొందినవారికి వీరస్వర్గం లభించింది. గెలిచి బతికున్నవారికి మిగిలింది, నెత్తుటి కూడు, దానిమీద విరక్తి, తాము చంపిన బంధువులకు సంవత్సరం పొడవునా శ్రాద్ధం పెట్టవలసిన గతి! ఈ పరిస్థితినే హిందీలో చెప్పాలంటే, "జీత్ నే వాలేకో హార్ మిలా!" జీతనా అంటే గెలవటం. హార్ అంటే పూలహారం అని ఒక అర్థముంది, ఓటమి అని మరో అర్థముంది. గెలిచినవారికి పూలదండ వేస్తాము. కానీ గెలిచి ఓడినవారయ్యారని కూడా అర్థం వస్తుంది.
ఇంతటి మారణహోమానికి కారకులెవరూ అంటే, పాంచాలి, సూత్రధారి శ్రీకృష్ణుడు అని చిరస్మరణీయమైంది.
మీరు ఆచరించే ప్రతీ కార్యానికీ మూలం మీ మనసు, దానిలో ఏర్పడ్డ లక్ష్యాలు. కానీ అవి ఏర్పడటానికి కారణం- జన్మజన్మాంతరాల నుండీ నడిపిస్తున్న మరణంలేని ఆత్మ. అందువలన, మీరు చేసే ప్రతి పనికి, వాటికి లభించిన ప్రతిఫలానికీ మీరే బాధ్యులు కానీ వేరెవరూ కారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more