ఉద్యోగ ధర్మంగా భావిస్తూ చట్టాన్ని అతిక్రమిస్తున్నవారిలో ఎక్కువగా పోలీసు, జైళ్ళ శాఖలోనే కనిపిస్తారు. నేరస్తుల చేత నిజం చెప్పింటం తమ విధి అన్న భావనలో నిందితులు విచారణ వరకూ వెళ్ళకముందే వాళ్ళు చేసారని పోలీసులు అనుకుంటున్న నేరాలకు వారు ముందుగానే శిక్షననుభవించిన ఉదంతాలు వెలుగులోకి వచ్చినవే ఎన్నో ఉన్నాయి. హింసకి పాల్పడేవారిని ప్రాణాలకు తెగించి కష్టపడి పట్టుకున్నా, చివరకు చట్టం లొసుగులను ఆసరాగా చేసుకుని పోలీసులను వెక్కిరించుకుంటూ బయటకు పోయి దర్జాగా బతుకుతున్నవారిని చూసి కసితో అలాంటివారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపెయ్యటం కూడా అలాంటిదే. అలాగే కోర్టులో శిక్షపడి జైళ్ళల్లో ఉన్న ఖైదీలు మారుమాట్లాడకుండా చెప్పినమాట వినటం కోసం, పారిపోయే ఆలోచనే వారిలో రాకుండా ఉండటం కోసం వారిని చిత్రహింసల పాలుచేసినవారున్నారు. కానీ అభేద్యమైన నాలుగు గోడల మధ్య జరిగే విషయాలన్నీ బయటకు ఎలా వస్తాయి.
కానీ, కంబోడియన్ ప్రజానీకానికి చేసిన ద్రోహంగా భావిస్తూ, ఖ్మేర్ రౌగ్ సుప్రీం కోర్టు, ప్రధాన జైలు అధికారికి అతను చేసిన ఘాతుకాలన్నీ బయటపడటంతో, అతని శేషజీవితమంతా జైలులోనే గడపమని ఆదేశించింది. డోయిక్ అనబడే జైలు అధికారికి ఫ్నామ్ పెన్ లో యుఎన్ ఆధారిత కోర్టులో 35 సంవత్సరాల జైలు శిక్ష విధించటమైంది. వేలాదిమంది ఖైదీలను వారిని ఉరితీసేముందు వారిని చిత్రహింసకు గురిచేసిన పాపానికి ఒడిగట్టుకున్న డోయిక్ కి కింది కోర్టులో పడ్డ 19 సంవత్సరాల శిక్ష తక్కువేనని ప్రాసిక్యూటర్స్ కేసుని పై కోర్టులో వెయ్యగా, అక్కడ శిక్షాకాలాన్ని 35 సంవత్సరాలకు పెంచటం జరిగింది. అయితే సాంకేతికంగా లెక్కల్లో అది 11 సంవత్సరాలకు కుదించబడుతుంది.
12272 మందిని క్రూర మరణాలకు పాల్పడేట్టు చూసిన డోయిక్ కి కింది కోర్టులో విధించిన శిక్ష తక్కువేనని సుప్రీం కోర్టు భావించింది. అప్పీల్ లేని ఈ తీర్పుకి 69 సంవత్సరాల డోయిక్ జడ్జ్ కి మర్యాద పూర్వకంగా చేతులు జోడించి అంగీకరించాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more