Chandrababu support to textile traders protest against vat

Chandrababu Support to Textile Traders Protest Against VAT,Naidu to grill govt on VAT in Assembly,TDP president Sri Nara Chandrababu Naidu

Chandrababu Support to Textile Traders Protest Against VAT

chandrababu01.gif

Posted: 02/01/2012 10:01 AM IST
Chandrababu support to textile traders protest against vat

విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను తగ్గించేవరకు వ్యాపారులు ఉద్యమించా లని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కోరారు. వ్యాట్‌కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని హామీ నిచ్చారు. వస్త్రాలపై ప్రభుత్వం విధించిన 5శాతం వ్యాట్‌ను ప్రభుత్వం ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేస్తూ తొమ్మిది రోజులు వస్త్ర వ్యాపారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని చంద్ర బాబు సంద ర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికలు ఎప్పుడు వచ్చినా 5శాతం విధించిన వ్యాట్‌ను ఎత్తివేస్తూ ఎన్నికల ప్రణాళికలో పెడతామ న్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వ్యాట్‌ తగ్గించాలని ప్రభుత్వాన్ని నిలదీసి, ఒత్తిడి తెస్తా మని చెప్పారు. వ్యాట్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మె ల్యేలు ప్రత్యక్షంగా పాల్గొంటారని చంద్రబాబు తెలి పారు. ప్రభుత్వం అన్నిరకాల ఛార్జీలు, పన్నుల మోత తో అన్ని వర్గాలను తీవ్ర ఇబ్బందు లకు గురిచేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పనికిరాని ప్రభు త్వం అని, సిఎం ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇక్కడ వస్త్రాలపై 5శాతం విధించడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 'చలో అసెంబ్లీ' నిర్వహించి, ప్రభు త్వంపై ఒత్తిడి తేవాలని సూచిం చారు. వ్యాపారులు సాగించే పోరాటానికి టిడిపి అండగా ఉంటుందన్నారు. వస్త్ర వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులు ప్రకాశ్‌, సంగ మేశ్వర్‌ ప్రభృతులు మాట్లాడారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All parties in ap must unite on t chidambaram
Msdhoni happy to step down as captain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles