Ranbaxy shares tumbles

Ranbaxy shares tumbles,Ranbaxy, shares, BSE, US court

Ranbaxy shares tumbles

Ranbaxy.gif

Posted: 01/27/2012 01:49 PM IST
Ranbaxy shares tumbles

Ranbaxy shares tumbles 7 pc on consent decree

ఔషధాల తయారీలో ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ర్యాన్‌బాక్సీపై అమెరికాలో మరిన్ని సమస్యలు ఎదురుకానున్నాయి. కంపెనీపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఇంజంక్షన్ ఆదేశాలు జారీ చేయాలంటూ మేరీల్యాండ్ కోర్టును అమెరికా న్యాయశాఖ కోరింది. ఇందుకోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) విజ్ఞప్తి మేరకు కాన్సెంట్ డిక్రీని దాఖలు చేసింది. కోర్టు దీనికి సానుకూలంగా స్పందిస్తే.. అమెరికా, భారత్‌లోని ప్లాంట్లలో ర్యాన్‌బాక్సీ కీలక మార్పులు చేయాల్సి వస్తుంది.

అలాగే, ప్రమాణాలను మెరుగుపర్చుకునే వరకూ కొన్ని ప్లాంట్లలో ఔషధాల తయారీని పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని న్యాయశాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ టోనీ వెస్ట్ తెలిపారు. కంపెనీ తన లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు భవిష్యత్‌లో మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, గతేడాది డిసెంబర్ 20న కుదుర్చుకున్న కాన్సెంట్ డిక్రీలో పేర్కొన్న షరతులకు కట్టుబడి ఉంటామని, మెరుగైన ప్రమాణాలను పాటిస్తామని ఢిల్లీలో ర్యాన్‌బాక్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి భారత్‌లోని పౌంతా సాహిబ్, బాటామండీ, దేవాస్ ప్లాంట్లలో తయారయ్యే ఔషధాల దిగుమతిపై 2008లో ఎఫ్‌డీఏ అలర్ట్ విధించింది. ఈ మూడు ప్లాంట్లలో తయారు చేసే 30 జనరిక్ ఔషధాలను నిషేధించింది. అటుపైన ఇదే అంశంపై, అమెరికా గ్లోవర్స్‌విల్‌లో ఉన్న కంపెనీ ప్లాంటు కూడా మూతపడింది. తాజా కాన్సెంట్ డిక్రీ షరతుల ప్రకారం ఈ ప్లాంట్లు ప్రమాణాలను అందుకునే దాకా వీటిలో అమెరికా మార్కెట్ కోసం ఔషధాలు తయారు చేయడానికి ఉండదు. అలాగే, ప్రభావిత ప్లాంట్లలో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రత్యేక నిపుణుడిని నియమించుకోవాల్సి ఉంటుది. అదేవిధంగా స్వతంత్ర ఆడిటర్‌తో ఆడిటింగ్ జరిపించాల్సి ఉంటుందని అమెరికా న్యాయశాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Memory card
Iits and the warangal nit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles