Mitt romneys loss personal setback for nikki haley

Mitt Romney's loss personal setback for Nikki Haley,Republican presidential primary, upending the battle to challenge President,US presidential elections 2012,South Carolina Republican Primary,Rick Santorum,Republican Presidential Candidate Race,Republican Party,Newt Gingrich,Mitt Romney,Barack Obama

ewt Gingrich trounced Mitt Romney in South Carolina's Republican presidential primary, upending the battle to challenge President Barack Obama Mitt Romney's loss personal setback for Nikki Haley

Mitt Romney.gif

Posted: 01/23/2012 01:48 PM IST
Mitt romneys loss personal setback for nikki haley

Mitt Romney's loss personal setback for Nikki Haley ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ముందంజలో ఉన్న మిట్ రోమ్నీ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నవ్విన నాప చేనే పండుతుందంటారు. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి ఎవరూ పరిగణనలోకి తీసుకోని న్యూట్ గింగ్‌రిచ్ అనే అభ్యర్థి అనూహ్యం గా ముందుకు దూసుకొచ్చారు. అమెరి కా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు స్పీకర్‌గా పని చేసిన 68 ఏళ్ల గింగ్‌రిచ్ అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ.. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష స్థానానికి అభ్యర్థి అవుతారని భావిస్తున్న విలార్డ్ మిట్ రోమ్నీని రేసులో వెనక్కు నెట్టేశారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించేందుకు సౌత్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ప్రాథమిక (ప్రైమరీ) ఎన్నికల్లో గింగ్‌రిచ్ వి జయం సాధించారు. దీంతో.. రిపబ్లికన్ల తరఫున ప్రధాన పోటీదారుగా అందరూ భావించిన రోమ్నీ వెనకపడినట్లయింది. తద్వారా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఒబామాను.. నవంబర్ 6న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఢీకొనే అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరలేచింది. సౌత్ కరోలినా ప్రైమరీలో గింగ్‌రిచ్‌కు 40.4 శాతం ఓట్లు రాగా.. మిట్‌రోమ్నీకి 27.9 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. 

రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో సౌత్ కరోలినా నుంచి నెగ్గిన వ్యక్తికే.. అమెరికా అధ్యక్ష స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం చాలా ఏళ్లుగా లభిస్తోంది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో బరాక్ ఒబామాను ఢీకొనే వ్యక్తి గింగ్‌రిచే అవుతారేమోనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సౌత్ కరోలినాలో గింగ్‌రిచ్ గెలవడం, అంతకుముందు న్యూ హాంప్‌షైర్‌లో రోమ్నీ విజయం సాధించడం, ఐవా రాష్ట్రంలో శాంటోరమ్ స్వల్ప మెజారిటీతో నెగ్గడంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ తీవ్రమైనట్లు కనపడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee writes book on important landmarks of her career
More statues more sin cautions cpi leader narayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles