Curious and furious over goa all women poll team

Curious and furious over Goa all-women poll team,Goa by male bureaucrats, Election Commission, all-women team,Mumbai

Curious and furious over Goa all-women poll team

Goa.gif

Posted: 01/20/2012 10:01 AM IST
Curious and furious over goa all women poll team

అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే గోవాకు పరిశీలకులుగా ఈసారి అందరూ మహిళలే ఉన్న బృందాన్ని పంపాలని ఎన్నికల సంఘం ఈ వారారంభంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. గోవాలో పురుషులను పరిశీలకులుగా పంపితే, బీచ్‌లలో విహరిస్తూ సరదాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలతో ఇసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొందరు మహిళలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. ‘వారికేనా, మాకు సరదాలుండవా?’ అని రివర్సయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా అందరూ మహిళలే ఉన్న టీమ్‌ను పంపాలనుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నిర్ణయంపై పలు చర్చలు జరుగుతున్నాయి. విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) గుర్తు ఏనుగు, ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాలకు ముసుగులు వేయాలని ఇదివరకు ఇసీ తీసుకున్న నిర్ణయం మాదిరే ఈ నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. నిజంగా మహిళల్నే పరిశీలకులుగా పంపితే ఆ అంశం అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తుందని కొందరంటున్నారు. 

గత ఎన్నికల్లో ఇసీ పరిశీలకులుగా పంపిన మగ అధికారులు ఎన్నికల అక్రమాలపై నిఘా ఉంచడానికి బదులు గోవా బీచ్‌లలో తిరిగి, హాట్‌ స్పాట్స్‌కు వెళ్లి, అక్కడి యువతులతో శృంగారం సాగించారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇసీ ఈసారి మహిళాబృందాన్ని పంపాలని నిర్ణయించింది. దీనిపై బ్రిటీష్‌ పత్రిక ‘ఇండిపెండెంట్‌’ గోవాలోని బీచ్‌లు, అక్కడి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మగవారు ఆ బీచ్‌లలో సరదాగా గడపాలనుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదు’ అని రాసింది. గోవాకు తమను ఎన్నికలపరిశీలకులుగా పంపమని మగవారి నుంచి ఇసీకి ఎన్నో దరఖాస్తులు కూడా వచ్చాయి. అందులో అంతరార్థాన్ని గ్రహించిన ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళలు కూడా విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల సంఘం నిర్ణయం పక్షపాతంతో కూడుకున్నది. గోవాలో మగవాళ్లయితే సరదాగా తిరుగుతారు, ఆడవాళ్లు తిరగరన్న ఉద్దేశంతో ఇసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ సరదా అన్నది మగవారికేనా, ఆడవారికి అక్కర్లేదా?’ అని తరచు గోవాకు వెళ్లే గినెల్లీ డిసౌజా ప్రశ్నించారు. ‘ఇండిపెండెంట్‌’ జర్నలిస్ట్‌ సుహాసినీ రాజ్‌ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ‘కేవలం సెక్స్‌ కారణంగానే పురుషాధికారుల్ని కాదని, మహిళల్ని పరిశీలకులుగా పంపుతున్నారు. మహిళలు సరదాకు నోచుకోరా? గోవాలో వారికీ సరదాలుంటాయి’ అని ఒక జాబితా కూడా ఇచ్చారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shilparamam night bazaar to be shut early
Trs party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles