C ramachandraiah and ganta srinivasa rao

C. Ramachandraiah and Ganta Srinivasa Rao,PRP MLAs C Ramachandraiah and Ghanta Srinivasa Rao,PRP chief Chiranjeevi

C. Ramachandraiah and Ganta Srinivasa Rao

Ganta.gif

Posted: 01/19/2012 05:07 PM IST
C ramachandraiah and ganta srinivasa rao

C. Ramachandraiah and Ganta Srinivasa Rao

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్యలు మంత్రివర్గంలోకి రాబోతున్నారు. రాజ్ భవన్ లో జరగనున్న ప్రమాణ స్వీకారానికి హాజరవటానికి వీరిద్దరు నేతలు ముందుగా చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. తమకు ఇచ్చిన ఈ అవకాశానికి ఇద్దరు నేతలూ సోనియాగాంధీ, చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లకు కృతఙతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చెయ్యటానికి కృషిచేస్తామన్నారు.

కొత్తగా రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం నేతలు సి.రామచంద్రయ్య(సిఆర్), గంటా శ్రీనివాస రావులకు శాఖలు కేటాయించినట్లుగా సమాచారం. రామచంద్రయ్యకు విద్యుత్ శాఖ, గంటకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ఉత్తర్వులు అందలేదు. సిఆర్‌కు వ్యవసాయం, గంటకు ఓడరేవులు, మౌలిక సదుపాయల శాఖ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, ప్రాధాన్యత కల్గిన శాఖలు ఇవ్వాలని వారు పట్టుబట్టినట్లుగా సమాచారం. దీంతో వారికి విద్యుత్, వాణిజ్య శాఖలు కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు మర్యాదపూర్వకంగా చిరంజీవి, గంటా, సిఆర్ కిరణ్‌ను కలవనున్నారు. కాగా తమ వర్గానికి మంత్రి పదవులు దక్కడంతో చిరంజీవి వర్గంలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో చిరంజీవి తన వర్గం ఎమ్మెల్యేలు, నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి సిఆర్, గంటాలను సన్మానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Musharraf in exile may return to karachi
Cm taken namaste telangana owner to delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles