Cruise ship survivors from hyderabad stranded in rome hotel

Cruise ship survivors from Hyderabad stranded in Rome hotel,Italian ship with 23 crew members,including six IndiansSuresh Chary, B. Srikanth, Jonathan Paturi, Reddy Srinu, N. Sharan Kumar and Shashidhar

Cruise ship survivors from Hyderabad stranded in Rome hotel

Cruise ship.gif

Posted: 01/18/2012 02:49 PM IST
Cruise ship survivors from hyderabad stranded in rome hotel

Cruise ship survivors from Hyderabad stranded in Rome hotel

ఇటలీ సముద్ర తీరంలో శుక్రవారం రాత్రి రాళ్లను ఢీకొట్టి మునిగిపోయిన కోస్టా కంకోర్డియా నౌక నుంచి 201 మంది భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని రోమ్‌లో భారత రాయబారి సునీల్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఇంకా ఒకరి జాడ తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. భారతీయులకు ప్రయాణ దస్తావేజులు ఇవ్వడంలో ఎలాంటి సమస్యలులేవని, టికెట్లు సిద్ధమైన వెంటనే దస్తావేజులు అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో నౌకలో ఉన్న 300 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని, ఎవరూ మృతి చెందలేదని ఇటలీలోని భారత రాయబారి దేబవూబత సాహా ప్రకటించారు.

 (ఇట లీ)లగ్జరీ లైనర్ కోస్టా కంకార్డియా నౌక ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన ఆరుగు రు ఉన్నారు. నౌక ప్రమాదవార్త తెలిసిన వెం టనే తొలుత భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు, వారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆనందానికి గురయ్యారు. ప్రస్తుతం వారంతా రోమ్‌లోని మారియట్ హోటల్‌లో బస చేశారని, అక్కడ్నుంచి నగరానికి బయలుదేరతారని వారి బంధువులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది. నౌక శిథిలాలను పేల్చి జరిపిన గాలింపులో మరో అయిదు మృతదేహాలు లభించాయి. ఇంకా 24 మంది జాడ తెలియవలసి ఉందని ఇటలీ కోస్ట్‌గార్డ్ అధిపతి మర్కో బ్రుస్కో తెలిపారు. ఈ దుర్ఘటనపై కూలంకషంగా దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ సాగ ర సంస్థ (ఐఎంఓ) ప్రధాన కార్యదర్శి కోజీ సెకిమిజు డిమాండు చేశారు. ఈ ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకోరాదని, భారీ ప్రయాణికుల నౌకల భద్రత అంశాన్ని పర్యావలోకనం చేయవలసిన అవసరాన్ని ఈ ప్రమాదం గుర్తు చేస్తున్నదని పేర్కొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brute force gate crashes wifi systems
Yadagirigutta sri lakshminarasimha swamy temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles